Begin typing your search above and press return to search.

మెగా ప‌వ‌ర్ స్టార్ ఆ విష‌యంలో హ్యాపీగా లేడా?

By:  Tupaki Desk   |   22 Sep 2022 8:53 AM GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ ఆ విష‌యంలో హ్యాపీగా లేడా?
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న న‌టిస్తున్న RC 15 షూటింగ్ కి బ్రేక్ ప‌డ‌టంతో వైఫ్ ఉపాస‌న‌తో క‌లిసి స‌ర‌ద‌గా ఊటీకి వెకేష‌న్ కి వెళ్లిన విష‌యం తెలిసిందే. రెండు, మూడు రోజుల పాటు అక్క‌డ స‌ర‌దాగా గ‌డిపిన ఈ జోడీ వెకేష‌న్ ని ముగించుకుని బుధ‌వారం హైద‌రాబాద్ లో అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. త‌మ వెంట పెట్ డాగ్ రైమ్ ని కూడా తీసుకెళ్లి అక్క‌డ ఎంజాయ్ చేసి తిగిరి హైద‌రాబాద్ చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే.

స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన 'RRR' త‌రువాత రామ్ చ‌ర‌ణ్ ది గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో RC 15 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న‌ త‌న 15వ ప్రాజెక్ట్ లో న‌టిస్తున్నాడు. చ‌ర‌ణ్‌, శంక‌ర్ ల‌కు ఇది 15వ ప్రాజెక్ట్ కావ‌డం విశేషం.

రాజ‌మండ్రిలో గ‌త కొన్ని నెల‌ల క్రితం మొద‌లైన ఈ మూవీ ఆ త‌రువాత అమృత్ స‌ర్‌, హైద‌రాబాద్, వైజాగ్ ల‌లో కీల‌క షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలిసిన స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీ షూటింగ్ 70 శాతం పూర్త‌యిన‌ట్టుగా తెలుస్తోంది.

త్వ‌ర‌లోనే తాజా షెడ్యూల్ ని ప్రారంభించ‌నున్నారు. ఊటీ వెకేష‌న్ ముగించుకుని హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చిన రామ్ చ‌రణ్ ఈ మూవీ త‌దుప‌రి షెడ్యూల్ లో పాల్గొన‌నున్నార‌ట‌. ఇదిలా వుంటే శంక‌ర్ ఆగిపోయిన 'ఇండియ‌న్ 2'ని మ‌ళ్లీ మొద‌లు పెట్టాడు. RC15 మూవీతో పాటు 'ఇండియ‌న్ 2' ని కూడా ఒకేసారి పూర్తి చేయబోతున్నాడ‌ట‌. రెండు సినిమాల షూటింగ్ ల‌ని ప్యార‌ల‌ల్ గా పూర్తి చేయ‌డానిక శంక‌ర్ రెడీ అయ్యాడు. ఇదే చ‌ర‌ణ్ కు న‌చ్చ‌డం లేద‌ట‌. ఈ విష‌యంలో చ‌ర‌ణ్ హ్యాపీగా లేడ‌ని తెలుస్తోంది.

శంక‌ర్ 'ఇండియ‌న్ 2' ప్రారంభించ‌నంత వ‌ర‌కు RC 15 పై చాలా కేర్ గా క‌నిపించార‌ట‌. ఎప్పుడైతే 'ఇండియ‌న్ 2'ని మొద‌లు పెట్టారో అప్ప‌టి నుంచి RC 15 పై కాస్త ఇంట్రెస్ట్ త‌గ్గింద‌ని, ఆ విష‌యంలో చ‌ర‌ణ్ హ్యాపీగా లేర‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ కార‌ణంగానే ఈ మూవీ అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ లో ఉండగానే చ‌ర‌ణ్ త‌న 16వ ప్రాజెక్ట్ ని మొద‌లు పెట్టాల‌ని ప్లాన్ లు చేసుకుంటున్న‌ట్టుగా వార్త‌లు వినిపించ‌డం మొద‌లైంది. ఈ నేప‌థ్యంలోనే చ‌ర‌ణ్ ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ వేణుతో పాటు క‌న్న‌డ ద‌ర్శకుడు న‌ర్త‌న్ తో సినిమా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారంటూ వార్తలు వినిపించాయి.

అయితే చ‌ర‌ణ్ మైండ్ లో మాత్రం థింక్ బిగ్ అన్న‌ది ర‌న్న‌వుతున్న‌ట్టుగా తెలుస్తోంది. 'RRR' త‌రువాత త‌న ఆలోచ‌నా థోర‌ణీ మొత్తం మారిపోయింద‌ని, లార్జ‌ర్ దెన్ లైఫ్ సినిమాలే చేయాల‌నే ఆలోచ‌న‌లో రామ్ చ‌ర‌ణ్ వున్నాడ‌ని ఇన్ సైడ్ టాక్‌. బ‌య‌ట ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్టుగా చ‌ర‌ణ్ త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ ని న‌ర్తేన్ తో చేస్తాడా? .. లేక లోకేష్ క‌న‌గారాజ్ కోసం ఎదురుచూస్తాడా? అన్న‌వి వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.