Begin typing your search above and press return to search.

ఐఏఎఫ్ పిలుపు మేరకు డీపీ చేంజ్ చేసిన మెగా ప్రిన్స్..!

By:  Tupaki Desk   |   23 Sep 2022 8:52 AM GMT
ఐఏఎఫ్ పిలుపు మేరకు డీపీ చేంజ్ చేసిన మెగా ప్రిన్స్..!
X
మెగా బ్రాండ్ తో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ.. వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచుకున్నాడు యువ హీరో వరుణ్‌ తేజ్‌. ఇప్పటి వరకూ తెలుగు ప్రేక్షకులను అలరించిన మెగా ప్రిన్స్.. VT13 మూవీతో బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.

వరుణ్ తేజ్ ఇటీవల తన 13వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత వైమానిక దళం స్ఫూర్తితో వాస్తవ సంఘటన ఆధారంగా వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ యాక్షన్ డ్రామాని తెరకెక్కించనున్నారు. తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న ఈ సినిమాని ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.

వరుణ్ తేజ్ ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ ఆకట్టుకుంది. ఈ పాత్ర కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకోవడమే కాదు.. శారీరకంగా మానసికంగా ఎంతో దృఢంగా ఉండటానికి హార్ట్ వర్క్ చేస్తున్నాడు.

IAF ఆఫీసర్ గా నటించడానికి సన్నద్ధం అవుతున్న వరుణ్ తేజ్.. ఇప్పుడు తన ట్విట్టర్ ఖాతా డిస్ ప్లేగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సింబల్ ని పెట్టుకున్నాడు. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా ఐఎఎఫ్ పిలుపు మేరకు మెగా హీరో తన సోషల్ మీడియా డీపీని చేంజ్ చేశాడు.

''ఐఎఎఫ్ యొక్క ప్రమాదకర శక్తి దాని కాటుకు మరిన్ని పళ్లను జోడించినందున.. మీ డీపీని మార్చడం ద్వారా స్వదేశీ లైట్ కంబాట్ హెలికాప్టర్‌ ను స్వాగతించడంలో మాతో చేరండి. మీ హృదయం ఉన్నచోట మీ డీపీని ఉంచండి!'' అని భారత వైమానిక దళం ట్విట్టర్ లో పిలుపునిచ్చింది. దీనికి స్పందించిన వరుణ్.. ఆత్మ నిర్భర భారత్ అని ట్వీట్ చేసి తన డీపీని చేంజ్ చేసాడు.

కాగా, VT13 ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నందుకు వరుణ్ తేజ్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ''ఐఎఎఫ్ ఆఫీసర్‌ గా నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. బిగ్ స్క్రీన్ పై మన హీరోల శౌర్యాన్ని చాటే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నాను. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కి గొప్ప నివాళిగా ఈ చిత్రం ఉండబోతోంది. ఎయిర్‌ ఫోర్స్‌ ఆఫీసర్‌ గా పాత్ర చాలా ఆసక్తికరంగా.. చాలా లేయర్స్‌ తో కూడి ఉంటుంది. దీని కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాను'' అని వరుణ్ తెలిపారు.

అయితే VT13 అనేది భారత ఎయిర్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఇన్ స్పైరింగ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కనుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. 2019లో పాకిస్తాన్ బాలాకోట్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియా చేసిన దాడుల్లో పాల్గొన్న అభినందన్.. వీరోచితంగా పోరాడి పాక్ యుద్ధ విమానాన్ని కూల్చి దొరికిపోయారు. అయితే భారత్ సహా అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి చివరకు అభినందన్ ను పాక్ మన దేశానికి అప్పగించింది. ఇలాంటి సంఘటనల నేపథ్యంలోనే వరుణ్ సినిమా రాబోతోందని అంటున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.

VT13 సినిమాతో శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ సంస్థలు కలిసి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తారు. నవంబర్ సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని.. 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.