Begin typing your search above and press return to search.

ఓటీటీ, వెంకీ, గని, ఎఫ్‌4, స్టార్‌ డం పై మెగా ప్రిన్స్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   26 May 2022 5:30 PM GMT
ఓటీటీ, వెంకీ, గని, ఎఫ్‌4, స్టార్‌ డం పై మెగా ప్రిన్స్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
X
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఈ ఏడాది లో ఇప్పటికే గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్‌ ఆ సినిమా తో ప్లాప్‌ అయ్యాడు. గని నిరాశ పర్చినా కూడా ఖచ్చితంగా ఎఫ్‌ 3 తో ఒక భారీ విజయాన్ని వరుణ్ తేజ్ దక్కించుకోబోతున్నాడు అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది.

ఎఫ్ 3 సినిమా ప్రమోషన్ లో భాగంగా గత రెండు వారాలుగా వరుణ్‌ తేజ్ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఆయన పలు ఇంటర్వ్యూల్లో పలు విషయాల గురించి స్పందించాడు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని కీలక విషయాలను గురించి ఇప్పుడు మనం చూద్దాం.

ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారా అంటూ ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించిన సమయంలో తప్పకుండా ఓటీటీ లో మంచి కథతో వస్తే వెబ్‌ సిరీస్ లు చేసేందుకు సిద్దం. ఓటీటీ కోసం ఇప్పటికే కొన్ని కథలు నా వద్దకు వచ్చాయి. కాని అందులో ఏవి నాకు నచ్చలేదు. ఒక వేళ నచ్చితే ఖచ్చితంగా వెబ్‌ సిరీస్ లు చేస్తానంటూ పేర్కొన్నాడు.

వెంకటేష్ గారితో నటించడం పట్ల స్పందిస్తూ.. ఆయన ఒక నటుడిగా కంటే ఒక మనిషిగా అద్బుతమైన వ్యక్తి. ఆయనతో ఉన్నప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటాను. ఆయన ఒక గురువుగా నాకు ఎఫ్‌ 2 మరియు ఎఫ్‌ 3 ల్లో ఎన్నో నేర్పించారు అన్నట్లుగా వరుణ్‌ తేజ్‌ చెప్పుకొచ్చాడు.

గని ఫెయిల్యూర్ గురించి స్పందిస్తూ.. ఆ సినిమా కోసం కరోనా వల్ల మూడు సంవత్సరాల పాటు ట్రావెల్‌ చేశాం. కాని మా అంచనాలు తారుమారు అయ్యాయి. మా జడ్జ్‌ మెంట్‌ తప్పు అని తేలింది. సినిమా ప్లాప్ అవ్వడం చాలా బాధ కలిగించింది. అందుకే ప్రేక్షకులకు సినిమా గురించి లెటర్ రాశాను అన్నాడు.

ఎఫ్ 4 ఉంటుందా అని ప్రశ్నించగా.. తప్పకుండా ఎఫ్ 4 ఉంటుంది. ఎఫ్ 3 విజయం సాధించిన కొంత సమయం తర్వాత ఎఫ్ 4 ను చేస్తాం. ఇప్పటికే ఎఫ్‌ 4 కు సంబంధించి రెండు మూడు స్టోరీ లైన్స్ చెప్పాడు. ప్రస్తుతం అంతకు మించి ఎఫ్ 4 గురించి చర్చలు జరగలేదు అన్నాడు.

ఇక ఎఫ్ 3 లో నత్తి ఉన్న పాత్రలో నటించడం పట్ల కొందరు విమర్శిస్తున్నారు.. స్టార్‌ డమ్‌ గురించి ఆలోచన చేయకుండా ఎఫ్ 3 లో నవ్వించడమే లక్ష్యంగా తాను నత్తి ఉన్న పాత్రలో కనిపించానంటూ వరుణ్ చెప్పుకొచ్చాడు.

వరుణ్ తేజ్ తో పూర్తి ఇంటర్వ్యూ లోకి వెళ్తే

''ఎఫ్ 3 నవ్వుల పండగలా వుంటుంది. సినిమా అంతా నవ్వుతూనే వుంటారు. ఫ్యామిలీ అంతా కలసి మళ్ళీ మళ్ళీ చూస్తారు'' అన్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. డబుల్ బ్లాక్బస్టర్ 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఎఫ్3 ' ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 వస్తున్న నేపధ్యంలో హీరో వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడారు. వరుణ్ తేజ్ పంచుకున్న 'ఎఫ్ 3' విశేషాలివి.

ఎఫ్ 2పెద్ద విజయం సాధించింది. ఎఫ్ 3 అంటే ఖచ్చితంగా భాద్యత పెరుగుతుంది కదా.. మీకు ఎలా అనిపించింది ?
ఖచ్చితంగా బాధ్యత వుంటుంది. ఐతే ఆ భాద్యతంతా దర్శకుడు అనిల్ రావిపూడిగారు తీసుకున్నారు. మాకు అనిల్ గారిపై నమ్మకం ఎక్కువ. ఎఫ్ 2 షూటింగ్ సమయంలోనే ఎఫ్ 3చేయాలని నిర్ణయించుకున్నారు. ఎఫ్ 3 డబ్బు నేపధ్యంలో చేస్తానని అప్పటికప్పుడే రెండు మూడు సీన్లు చెప్పారు. హిలేరియస్ గా అనిపించాయి. వెంకటేష్ గారు, నేను ఎఫ్ 2 థియేటర్ లో చూశాం. ప్రేక్షకులు ఆనందాన్ని చూసి తప్పకుండా ఎఫ్ 3 చేయాలని నిర్ణయించుకున్నాం. ఎఫ్ 2కి మించిన ట్రిపుల్ ఫన్ డోస్ ఎఫ్ 3లో వుంటుంది. సినిమా అంతా నవ్వుతూనే వుంటారు. ఎఫ్ 3 ఒక నవ్వుల పండగలా వుంటుంది.

ఎఫ్ 3 లో నత్తి పాత్రలో చేయడం ఎలా అనిపించింది ?

ఫైట్లు, యాక్షన్ చేయడం కష్టం .. డైలాగులు చెప్పడమే ఈజీ అనుకునేవాడిని. కానీ కామెడీ చేయడమే కష్టం. ఫన్ డోస్ పెంచడానికి అనిల్ గారు నత్తి క్యారెక్టరైజేషన్ ని డిజైన్ చేశారు. ఒకరికి రేచీకటి, మరొకరు సరిగ్గా మాట్లాడలేరు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రాత్రి పూట కలిస్తే ఎలా వుంటుంది.. అతనికి కనబడదు... వీడు మాట్లాడలేడు .. ఇలా చిన్న ఐడియాగా అనుకోని స్టార్ చేశాం. అది హిలేరియస్ గా వర్క్ అవుట్ అయ్యింది.

నత్తి కోసం స్పెషల్ గా హోం వర్క్ చేశారా ?

అనిల్ రావిపూడి గారు నటించి చూపించేవారు. ఆయన్ని సరిగ్గా అందుకుంటే యాక్టర్ పని ఈజీ అయిపోతుంది. ఐతే షూటింగ్ మొదటి రోజు కొంచెం టెన్షన్ పడ్డా. డైరెక్టర్ అనుకున్నది ఇవ్వగలనా లేదా ? అనే ఆలోచన వుండేది. ఫస్ట్ డే షూట్ తర్వాత అనిల్ గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ఈజీ అయ్యింది. ఐతే మాట అడ్డుపడిన ప్రతిసారి ఒక డిఫరెంట్ మ్యానరిజం చేయాలి. ప్రతిసారి కొత్త మ్యానరిజం చేయడం ఒక ఛాలెంజ్ అనిపించింది. ఐతే అనిల్ రావిపూడి అద్భుతంగా డిజైన్ చేశారు. మ్యానరిజమ్స్ చాలా క్రేజీగా చేశాం. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

ఎఫ్ 3 లో ఫన్ ఎవరికి ఫస్ట్రేషన్ ఎవరికి ?

డబ్బులు త్వరగా సంపాదించేస్తే ఫన్ అనుకుంటారు .. దాని వలన వచ్చే ఫస్ట్రేషన్ ని హిలేరియస్ గా చూపిస్తారు.

వెంకటేష్ గారితో మరోసారి వర్క్ చేయడం ఎలా అనిపించింది ? ఆయన నుండి ఏం నేర్చుకున్నారు ?

వెంకటేష్ గారితో కళ్యాణ్ బాబాయ్ చేశారు. నేను రెండో సారి కలసి పని చేయడం లక్కీగా ఫీలౌతున్నా. వెంకటేష్ గారు అంటే నాకు పర్శనల్ గా చాలా ఇష్టం. ఒక బ్రదర్, ఫాదర్ ఫిగర్ లా వుంటారు. చిరంజీవి గారితో ఆయనకి వుండే బాండింగ్, ఆయన అనుభవం ఇలా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. అప్పుడప్పుడు రానాకి ఫోన్ చేసి.. మీ బాబాయ్ .. నీకు చెప్పని విషయాలు నాకు చెప్తుంటారని ఏడిపిస్తుంటాను(నవ్వుతూ). వెంకటేష్ గారు చాలా లైట్ హార్టడ్. చాలా కూల్ గా వుంటారు. చాలా క్రమశిక్షణగా వుంటారు. ఆయన్ని చూసి సెట్స్ కి రెండు నిమిషాల్ ముందే వెళ్ళేవాడిని. ఇంత పెద్ద స్టార్ అయినప్పటికీ దేన్నీ గ్రాంటెడ్ తీసుకోరు. అది చాలా గ్రేట్ క్యాలిటీ. ఎప్పుడూ నవ్వుతూ వుంటారు. పాజిటివ్ గా వుంటారు.

ఎఫ్ 3 లో కామెడీ కాకుండా మీకు మెహరీన్ కు రొమాంటిక్ లవ్ ట్రాక్ కూడా ఉందా ? సాంగ్స్ లో కలర్ ఫుల్ గా కనిపిస్తున్నారు ?

మీరు పాట ని సరిగ్గా గమనిస్తే మెహరీన్ కు కొంచెం దూరంలోనే వుంటాను(నవ్వుతూ). ఈ సినిమాలో లవ్ వుంది. ఐతే అమ్మాయి- అబ్బాయి లవ్ కాదు. డబ్బు మీద వుండే లవ్. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ డబ్బుని ప్రేమిస్తారు. తమన్నా, మెహారీన్, సునీల్, అలీ.. అన్నీ పాత్రలు డబ్బునే ఇష్టపడతాయి. ఎఫ్ 2 నేను వెంకటేష్ గారు కోబ్రా గా కనిపించాం. ఇందులో జస్ట్ .. బ్రోస్ గా కనిపిస్తాం.

ఎఫ్ 3 షూటింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి చెప్పండి ?

ఎఫ్ 2షూటింగ్ లో కొంతమంది కొత్త. కానీ ఎఫ్ 3కి వచ్చేసరికి అంతా ఒక ఫ్యామిలీగా వుండేది. అన్నపూర్ణమ్మగారు, వై విజయ గారు మా కోసం అప్పుడప్పుడు భోజనం తెచ్చేవాళ్ళు. అందరం బోలెడు కబుర్లు చెప్పుకునే వాళ్ళం. షూటింగ్ ప్రతి రోజు పండగలా వుండేది.

ఎఫ్ 3 బడ్జెట్ పెరిగింది. రెమ్యునిరేషన్ కూడా పెరిగింది. మీ వాటా ఎంత పెరిగింది ?

సినిమా హిట్ కొడితే సాధారణం గానే రేమ్యునిరేషన్ పెరుగుతుంది కదా. ఇందులో చెప్పడానికి ఏముంది(నవ్వుతూ)

ఎఫ్ 3లో మీరు చాలా కొత్తగా ఉంటారని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్తున్నారు ? ఏమిటా కొత్తదనం ?

ఎఫ్ 3నాకు కంప్లీట్ డిఫరెంట్ జోనర్. ఎఫ్ 2లో తెలంగాణ కుర్రాడిగా చేశా. ఎఫ్ 3కి వచ్చేసరికి స్పెషల్ గా పాత్రని డిజైన్ చేశారు. నటనకి ఆస్కారం వుండేపాత్ర. కంటెంట్ కూడా చాలా బలంగా వుంటుంది.

ఎఫ్2 కథ కి కొనసాగింపుగా ఎఫ్ 3 వుంటుందా ?

లేదు. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ లో ఎలాగైతే పాత్రలు తీసుకొని కొత్త కథలు చెప్పారో ఎఫ్ 3లో కూడా కేవలం పాత్రలు మాత్రమే తీసుకొని కొత్తకథని చెప్పాం.

ఎఫ్ 3లో నలుగురు హీరోయిన్స్ తో పని చేశారు.. ఒకొక్కరి గురించి మీ అభిప్రాయం ఏమిటి ?

మెహరీన్, తమన్నాతో ముందే పని చేశాం. ఇందులో మెహరీన్, తమన్నా కోసం డిఫరెంట్ పాత్రలు డిజైన్ చేశారు. అలాగే పూజా హెగ్డే తో రెండు సినిమాలు చేశా. పూజా ఇందులో స్పెషల్ పార్టీ సాంగ్ చేస్తుంది. సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది.

టికెట్ రేట్లు తగ్గించడం వలన అడ్వాంటేజ్ వుంటుందని భావిస్తున్నారా ?

ఎఫ్ 3 ఫ్యామిలీ అంతా కలసి చూడాల్సిన సినిమా. ఒక వ్యక్తి తన ఫ్యామిలీ మొత్తన్ని సినిమా తీసుకువెళ్ళాలంటే పెరిగిన ధరలు భారం కావచ్చు. అందుకే అందరికీ అందుబాటులో వుండే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్ రేట్లు ఉండేలా మా నిర్మాత దిల్ రాజుగారు నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కలసి ఎఫ్ 3ని థియేటర్ లో ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా.

యాక్షన్, రోమాన్స్, కామెడీ.. ఇలా చాలా జోనర్ సినిమాలు చేశారు కదా ,.. ఇందులో ఏది మీకు తృప్తిని ఇచ్చింది ?

అన్ని సినిమాలు, పాత్రలు తృప్తినిస్తాయి. ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం, ఎఫ్ 2, .. ఇలా ఏ సినిమా చేసిన వంద శాతం ఎఫర్ట్ పెడతా. నాది అనుకునే పని చేస్తా. ప్రతి సినిమా నచ్చే చేస్తాం కదా.

ఇప్పుడు అందరు హీరోలు పాన్ ఇండియా అంటున్నారు. కథల సెలెక్షన్స్ ప్రోసస్ కూడా మారింది. ఇది చాలెజింగ్ గా అనిపిస్తుందా ?

ఇప్పుడు కథల ఎంపిక మారింది. ఐతే ఇది పాన్ ఇండియా సినిమా వల్ల కాదని భావిస్తున్నా. ఓటీటీ లో డిఫరెంట్ కంటెంట్ పెరిగింది. ప్రేక్షకులు ఇంకా డిఫరెంట్ కంటెంట్ కోరుకుంటున్నారు. వారికి కావాల్సిన కంటెంట్ ఇవ్వడం కూడా చాలెజింగ్ గా మారింది. ఇది ఒక రకంగా మంచిదే. కొత్తకథలు బయటికి వస్తాయి.

ఎఫ్ 3 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ నుండి వచ్చిన రియాక్షన్స్ ఏమిటి ?

ఫస్ట్ నాన్నకి ట్రైలర్ పంపించా. తర్వాత తేజుతో పాటు మా కజిన్స్ అందరితో కలసి చూశా. అందరూ గట్టిగా నవ్వుకున్నారు. ఆ పాత్రలో నన్ను చూసి షాక్ కూడ అయ్యారు. ''ఏంటి ఇలా పిచ్చోడిలా చేస్తున్నావ్'' అని సర్ ప్రైజ్ అయ్యారు. నిజానికి నేను ఇంట్లో చాలా రిజర్వ్డ్ గా ఉంటా. నన్ను నత్తి మ్యానరిజంలో చూసి షాక్ అయ్యారు. చరణ్ ఫోన్ చేసి చాలా బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు. ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేశారు.

పర్శనల్ గా మీకు ఏ జోనర్ ఇష్టం ?

అన్ని జోనర్స్ చేయాలని వుంటుంది. యాక్షన్ సినిమాలంటే చూడటం ఇష్టం.

దిల్ రాజు గారితో పని చేయడం ఎలా అనిపించింది ?

దిల్ రాజు గారి సినిమా అంటే నాకు హోమ్ బ్యానర్ లాంటింది. ఆయన ఫ్యామిలీ లో ఒకరిగా వుంటారు. సినిమా అంటే ఆయనకి ప్యాషన్. ఎన్ని సినిమాలు చేస్తున్నా ప్రతి సెట్ కి వెళ్తారు. సినిమాని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. చాలా ఫ్రెండ్లీ గా వుంటారు. ఎఫ్ 3 సెట్స్ లో ఎక్కువగా శిరీష్ గారు వుండేవారు. శిరీష్ గారు కూడా వండర్ ఫుల్ పర్శన్. ఎలాంటి సమస్య వచ్చిన క్షణాల్లో పరిష్కరిస్తారు. వారి బ్యానర్ లో చేయడం గొప్ప అనుభవం.

సునీల్ గారి కాంబినేషన్ గురించి చెప్పండి ?

కాలేజీలో వున్నపుడు సునీల్ గారికి ఫ్యాన్ ని. ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన హీరో అయిన తర్వాత ఆయన టైమింగ్ ని సరిగ్గా వాడుకోలేదమో అనిపించింది. మళ్ళీ వింటేజ్ సునీల్ ని అనిల్ రావిపూడిగారు చూపించబోతున్నారు ఎఫ్ 3 లో. సునీల్ గారితో పని చేయడం గ్రేట్ ఎక్స్ పిరియన్స్. ఆయన టైమింగ్ అద్భుతం. ఎఫ్ 3లో మా కాంబినేషన్ హిలేరియస్ గా వుంటుంది.

ఎఫ్ 3 లో కిడ్స్ గురించి స్పెషల్ ట్రాక్ వుందని విన్నాం ?

అవును. ఎఫ్ 3ని పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ జనరేషన్ కిడ్స్ కి ఎలాంటి సమస్య వుందనే అంశంపై స్పెషల్ గా ఒక ట్రాక్ డిజైన్ చేశారు. ఇది అద్భుతంగా వుండబోతుంది.

పూజా హెగ్డేతో చేసిన స్పెషల్ సాంగ్ గురించి చెప్పండి ?

చాలా మంచి పాట అది. ఐతే నాకు డ్యాన్స్ చేయడం ఎప్పుడూ టెన్షనే. వెంకటేష్ గారికి కూడా అదే టెన్షన్. కానీ రాజసుందరం మాస్టర్ చక్కగా డిజైన్ చేశారు. సాంగ్ ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం.

ఇప్పటివరకూ మీరు చేసిన చిత్రాలలో నచ్చిన పాత్ర ?

కంచె సినిమాలో చేసిన పాత్ర మోస్ట్ మెమరబుల్. తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ పాత్రలు కూడా ఇష్టం.

ఎఫ్ 4 వుంటుందని దిల్ రాజు గారు, అనిల్ రావిపూడిగారు చెప్పారు. కథ మీరు విన్నారా ?

ఒక మూడు పాయింట్లు చెప్పారు. మూడూ హిలేరియస్ గా వున్నాయి. ప్రస్తుతం మా దృష్టి ఎఫ్ 3 పై వుంది.

ప్రవీణ్ సత్తారు గారితో సినిమా ఎప్పుడు సినిమా ?

ఆగస్ట్ మొదటి వారంలో షూటింగ్ మొదలౌతుంది. పూర్తి యాక్షన్ సినిమా. లండన్ లో 70రోజులు షూటింగ్ వుంటుంది. నాన్నగారు, బీవిఎస్ఎన్ ప్రసాద్ గారు నిర్మిస్తున్నారు.

డబ్బు గురించి ఫస్ట్రేషన్ అయిన సంధర్భాలు ఉన్నాయా ?

చదువుకున్న రోజుల్లో వుండేది. సినిమాకి వెళ్తా అంటే నాన్న యాబై రుపాయులు ఇచ్చేవారు. అది దేనికీ సరిపోయేది కాదు. (నవ్వుతూ) లక్కీగా మంచి ఫ్రెండ్స్ వుండటం వల్ల సర్దుకునేవాళ్ళం.

డబ్బు పై మీ ఆలోచన ?

కొంతమందిని చూస్తే డబ్బు ఇంత ఈజీగా వస్తుందా ? అనిపిస్తుంది. ఐతే అంత ఈజీగా వచ్చిన డబ్బు అంతే ఈజీగా పోతుంది. ఎఫ్ 3లో కూడా అదే చెప్పాం. డబ్బు పట్ల జాగ్రత్తగా వుండాలి.

లబ్ డబ్ సాంగ్ లో చాలా గెటప్స్ లో కనిపించారు ?గెటప్స్ ని ఎంజాయ్ చేశారా ?

సినిమాలో చాలా గెటప్స్ వేయించారు. పోలీసు, పూజారి, రిచ్ మ్యాన్, పూర్ మ్యాన్ ఇలా చాలా గెటప్స్ వేశాం. అన్నీ చాలా సరదాగ వచ్చాయి.

మెగా ఫ్యామిలీతో మెగా మల్టీ స్టారర్ ఎప్పుడు ?

మాకు చేయాలనే వుంటుంది. అయితే అది మా చేతిల్లో లేదు. సరైన స్క్రిప్ట్ కుదరాలి కదా.

'మెగా ఫ్యామిలీ' ట్రైలర్ డైలాగ్ కి మెగాఫ్యాన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ?

పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమాలో అందరి హీరోలు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యే బ్లాక్ ని డిజైన్ చేశారు అనిల్ రావిపూడి. ఫ్యాన్స్ అంతా దాన్ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా.

సాయి ధరమ్ తేజ్ ఎలా వున్నారు ?

చాలా బావున్నాడు. మేము ఇద్దరం కలసి జిమ్ కి వెళ్తున్నాం. నెల క్రితమే షూటింగ్ కూడా మొదలుపెట్టాడు.