Begin typing your search above and press return to search.
ఏడేళ్లలో 60కోట్ల రేంజుకి ఎదిగిన మెగా ప్రిన్స్
By: Tupaki Desk | 4 April 2022 3:08 AM GMTఎవరైనా యంగ్ హీరో ఒక్కో మెట్టు ఎక్కుతూ మార్కెట్ రేంజును పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ దిశగా టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వేస్తున్న అడుగులు ఆషామాషీగా లేవు. మెగా హీరోల్లోనే రేర్ అండ్ వెరీ స్పెషల్ హీరోగా అతడి ప్లానింగ్ సర్వత్రా డిబేటబుల్ గా మారుతోంది. మెగా ఫ్యాన్స్ అండదండలు ఉన్నా కానీ ఇతర హీరోలతో పోలిస్తే యూనిక్ కాన్సెప్టుల్ని ఎంచుకుంటూ ప్రయోగాలు చేస్తూ అతడు వెళుతున్న దారి ఆశ్చర్యపరుస్తోంది.
వరుణ్ తేజ్ నటించిన తొలి సినిమా ముకుంద 2014 డిసెంబర్ లో విడుదలైంది. ఆరేళ్లు పూర్తయి ఏడో సంవత్సరం రన్నింగ్ లో ఉంది. ఈ ఆరేళ్లలోనే అతడు 60కోట్ల బిజినెస్ రేంజుకు ఎదిగాడు.
ఇది నిజంగా ఆషామాషీ వ్యవహారం కానేకాదు. వరుణ్ తేజ్ కంటే ముందే ప్రారంభమైన సీనియర్ నటవారసులు ఉన్నారు. కానీ వాళ్లందరి కంటే ది బెస్ట్ అనిపించాడు. తన సమకాలిక హీరోలు ఇంకా సరైన హిట్టు లేక కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. కానీ కెరీర్ లో నాలుగైదు హిట్ లు బంపర్ హిట్ చిత్రం కూడా వరుణ్ తేజ్ కి ఉన్నాయి.
ఇప్పుడు వరుణ్ తేజ్ నటించిన బాక్సింగ్ నేపథ్య చిత్రం గని పై భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమా అతడి రేంజును పెంచనుందని అంచనా ఉంది. ఈ సినిమా తర్వాత కూడా అతడు మరో భారీ యాక్షన్ చిత్రానికి సన్నాహకాల్లో ఉన్నాడని తెలిసింది. దీనికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తారు. అంతేకాదు.. ఈ మూవీ కోసం వరుణ్ ఏకంగా 12 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడని తెలిసింది.
వరుణ్ నటిస్తున్న ఒక్కో సినిమాకి 35-45 కోట్ల మధ్య బడ్జెట్ ఖర్చవుతోంది. థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ రేంజు 55-60 కోట్ల మధ్య ఉంది.
ఈ ఎదుగుదల నిజంగా అంత ఈజీగా సాధ్యపడేది కాదు. అంచెలంచెలుగా స్వయంకృషి తెలివైన ఎంపికలతో వరుణ్ తేజ్ తన కెరీర్ ని నిర్మించుకున్నాడనడానికి ఇంతకంటే పెద్ద విశ్లేషణ అవసరం లేదు. కొన్ని ఫ్లాపులు ఎదురైనా తట్టుకుని మార్కెట్లో నిలదొక్కుకోగలిగాడు మెగా ప్రిన్స్. మునుముందు ప్రయోగాత్మక కమర్షియల్ సినిమాలతో ఎదిగే సత్తా వరుణ్ తేజ్ కి ఉంది.