Begin typing your search above and press return to search.
థియేటర్లు ఓపెనయ్యే తేదీపై మెగా నిర్మాత క్లూ
By: Tupaki Desk | 24 July 2021 8:56 AM GMTతెలంగాణ ప్రభుత్వ వెసులుబాటుతో.. సింగిల్ థియేటర్ల పార్కింగ్ ఫీజు పునరుద్ధరణతో స్థానిక ఎగ్జిబిటర్లకు హుషారు పెరిగింది. తెలంగాణలో థియేటర్లు ఓపెన్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వందలాది థియేటర్లు రీఓపెన్ అవుతున్నాయి. నూరు శాతం ఆక్యుపెన్సీతో సినిమాల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతులిచ్చింది.
ఇక ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని అనుమతిలిచ్చినా ఎగ్జిబిటర్లు స్పందించలేదు. ఇప్పట్లో థియేటర్లు తెరిస్తే నష్టాలు తప్ప లాభాలు ఉండవని వెనుకడుగు వేస్తున్నారు. కొంత మంది అగ్ర నిర్మాతలు థర్డ్ వేవ్ భయాల నడుమ తమ సినిమాల్ని ఓటీటీల్లోనే రిలీజ్ చేసుకుంటున్నారు.
మరి ఏపీలో పూర్తి స్థాయిలో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయి? బొమ్మ ఎప్పుడు పడుతుంది? అన్న దానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మెగా నిర్మాత.. జీఏ2 అధినేత బన్నీ వాసు దీనిపై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఏపీలో కూడా థియేటర్లు తెరిచే అవకాశం ఉంటుంది. అప్పటికి ప్రేక్షకుల్లో కరోనా భయం తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రజలంతా ఇళ్లలో ఉండటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ ప్రేక్షకుల్లో విపరీతమైన భయాన్ని నెలకొల్పింది. అది తగ్గడానికి కొంచెం సమయం పడుతుంది. అప్పటి వరకూ థియేటర్లు తెరవకపోవడమే మంచిదన్నట్లు చెప్పుకొచ్చారు.
అయితే ఆయన థర్డ్ వేవ్ గురించి స్పందించినట్లు లేదు. థర్డ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైందని కథనాలొస్తున్నాయి. భారత్ లో సెప్టెంబర్ ...అక్టోబర్ నాటికి పీక్స్ స్టేజ్ కి థర్డ్ వేవ్ చేరుకునే అవకాశాలు ఉంటాయని డబ్ల్యూ.హెచ్.ఓ సహా ఐసీఎమ్మార్ కూడా హెచ్చరించింది. మరి బన్నీ వాసు ఆ నెలల్లో థియేటర్లు ఓపెన్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ అంతగా లేనప్పటికీ కేవలం జనాలు థియేటర్ వైపు మళ్లరన్న అనుమానంతోనే ఓపెన్ చేయలేదు. మరో నెల రోజుల తర్వాత థర్డ్ వేవ్ ఉంటుందని ఊహించుకుంటేనే ఇప్పట్లో థియేటర్లు తెరవలేమని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.
థర్డ్ వేవ్ కి స్కిప్ కొట్టేదెలా..?
కరోనా థర్డ్ వేవ్ వస్తుందా.. రాదా! ఇది ఇప్పటికి సస్పెన్స్ థ్రిల్లర్ లానే ఉంది. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినా ప్రజల్లో డౌట్ అలానే ఉంది. కొత్త వేవ్ నవంబర్ డిసెంబర్ నాటికి వస్తుందా...? లేక 2022లో మొదలవుతుందా..! అన్నదానిపైనా మల్లగుల్లాలు పడుతున్నారు. కానీ ఇంకా వైరస్ కి భయపడితే ప్రజలకు ఉపాధి కరువై ఆకలి చావులకు రెడీ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందన్నది ఒక విశ్లేషణ.
ఈ పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ రంగం నిలబడాలంటే ఏం చేయాలి..? అన్న చర్చా హీటెక్కిస్తోంది. టాలీవుడ్ లో తెరకెక్కి రిలీజ్ లకు రెడీ అవుతున్న సినిమాలన్నీ రిలీజైతేనే పరిశ్రమతో పాటు ఎగ్జిబిటర్లు నిలవగలితే పరిస్థితి ఉంటుంది. పరిశ్రమ అగ్ర హీరోలు చిరంజీవి- ఎన్టీఆర్-చరణ్ - బన్ని - ప్రభాస్- నాని- రానా వంటి స్టార్లు నటించిన భారీ పాన్ ఇండియా చిత్రాలు బరిలో ఉండడం కేజీఎఫ్ 2 లాంటి క్రేజీ చిత్రం రేసులో నిలవడం వంటి అంశాలు పాజిటివిటీని పెంచేవే. అయితే జనాల్ని థియేటర్లకు రప్పించేందుకు అలవాటు చేసేందుకు ఏం చేయాలి.. అన్నది బిగ్ టాస్క్.
ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే కంటెంట్ పరంగా టాలీవుడ్ వేరియేషన్ ప్రజలను ఆకర్షించే వీలుంది. అయితే నేరుగా స్టార్ హీరోల సినిమాల్ని రిలీజ్ చేసే ముందు పాత సినిమాలతో జనాలకు అలవాటు చేయాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇక ఇరు తెలుగు రాష్ట్రాల్లో 1750 థియేటర్లు రెడీగా ఉన్నాయి. ఇవన్నీ తెరుచుకుని 50శాతంతో ఆడినా అది నిర్మాతలను ఎగ్జిబిటర్లు పంపిణీదారులను క్రైసిస్ నుంచి కొంతవరకూ బయటపడేయడం ఖాయమని విశ్లేషిస్తున్నారు.