Begin typing your search above and press return to search.

ఫ్రెండు వార‌సుడికి మెగా ప్ర‌మోష‌న్‌?

By:  Tupaki Desk   |   30 May 2019 7:28 AM GMT
ఫ్రెండు వార‌సుడికి మెగా ప్ర‌మోష‌న్‌?
X
దివంగత నటుడు అంబరీశ్ - మేటి నాయిక‌ సుమ‌ల‌త దంప‌తుల‌ కుమారుడు అభిషేక్‌ నటించిన తొలి చిత్రం `అమర్‌` నేడు (మే31న) ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. బైక్ రేసింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి నాగశేఖర్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అంబరీశ్‌ అతిథి పాత్రలో నటించారు. నేడు ఆయ‌న వార‌సుడి డెబ్యూ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. ఇక‌పోతే ఇటీవ‌లే కర్నాట‌క మాంద్య నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందిన సుమ‌ల‌త త‌న కుమారుడి తొలి సినిమా రిలీజ్ సంద‌ర్భంగా ఎంతో ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. కుమారుడి సినిమాని మీడియాలో రిగ‌ర‌స్ గా ప్ర‌మోట్ చేస్తున్నారు.

ఆరున్న‌ర అడుగుల ఆజానుభాహుడిలా ఉన్న అభిషేక్ క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన శైలిలో రాణిస్తాడ‌ని సుమ‌ల‌త ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా తెలుగు- త‌మిళ వెర్ష‌న్ల‌ను అనువ‌దించి రిలీజ్ చేస్తార‌ని తెలుస్తోంది. ఒక‌వేళ తెలుగులో రిలీజ్ చేస్తే అంబ‌రీష్ - సుమ‌ల‌త‌కు ఇక్క‌డా ప‌లువురు స్టార్లు క్లోజ్ ఫ్రెండ్స్. మెగాస్టార్ చిరంజీవి- మంచు మోహ‌న్ బాబు స‌హా ఎంద‌రో బిగ్ స్టార్స్ నుంచి ప్ర‌మోష‌న‌ల్ సాయం ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ముఖ్యంగా అంబ‌రీష్ - సుమ‌ల‌త మెగాస్టార్ చిరంజీవికి అత్యంత స‌న్నిహితులు. అభిషేక్ కి మెగా సాయం అంద‌నుంద‌ని తెలుస్తోంది.

ఇక అంబ‌రీష్ 2018 నవంబ‌ర్ లో కాలం చేసిన సంగ‌తి తెలిసిందే. వార‌సుడు అభిషేక్ న‌టించిన తొలి సినిమాని చూడాల‌ని అంబ‌రీష్ ఎంతో త‌హ‌త‌హ‌గా ఉండేవార‌ట‌. కానీ ఆ సినిమాని వీక్షించే అవ‌కాశం క‌ల‌గకుండానే ఆయ‌న నిర్యాణం చెందారు. ప్ర‌స్తుతం కుమారుని స్టార్ ని చేసే బాధ్య‌త‌ను సుమ‌ల‌త స్వ‌యంగా నిర్వ‌ర్తిస్తున్నారు. న‌ట‌వార‌సుల వెల్లువ‌తో పాటు ప‌లువురు స్టార్ల నుంచి క‌న్న‌డ రంగంలో తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. మ‌రి అభిషేక్ ఏమేర‌కు రాణిస్తాడు? అన్న‌ది వేచి చూడాలి.