Begin typing your search above and press return to search.
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ గా మెగా ర్యాప్...!
By: Tupaki Desk | 3 Aug 2020 8:00 AM ISTమెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న తన 65 పుట్టినరోజును జరుపుకోనున్నారు. ప్రతి ఏడాది చిరంజీవి బర్త్ డే నాడు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా సెలబ్రేషన్స్ చేయడానికి ఫ్యాన్స్ ఇప్పటి నుండే ప్రణాళికలు మొదలు పెట్టారు. #ChiruBdayFestBegins హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి అభిమాన సంఘం మెగాస్టార్ పుట్టినరోజు ఘనంగా జరపాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా చిరుకి బర్త్ డే కానుకగా ఆయనకి విషెస్ తెలియజేస్తూ ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
కాగా బాస్ బర్త్ డే స్పెషల్ అంటూ 'మెగాస్టార్స్ మెగా ర్యాప్' పేరుతో విడుదల కానున్న ఈ పాటను వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు. ఈ పాటకు ఫ్రీక్ మాసన్ సంగీతం అందించగా సురేంద్ర ర్యాప్ ఆలపించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ని రామ్ చరణ్ ఫ్యాన్స్ విడుదల చేశారు. ఇక ఈ మెగా ర్యాప్ ని మెగాస్టార్ బర్త్ డే ముందురోజు అంటే ఆగస్టు 21న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి అభిమాన సంఘం వారు చిరు బర్త్ డే ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ కార్మికులను ఆదుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే.