Begin typing your search above and press return to search.
డిసెంబర్ 26.. మెగా డే ఫిక్సయినట్టే
By: Tupaki Desk | 9 Dec 2019 7:41 AM GMTమెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా- నరసింహారెడ్డి` యునానిమస్ గా అన్ని భాషల్లోనూ పాజిటివ్ రివ్యూలతో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా ఆ స్థాయిని రీచ్ అవ్వడంలో తడబడింది. అందుకే ఇప్పుడు 152వ సినిమా విషయంలో మెగా బాస్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మునుపటితో పోలిస్తే మరింత పక్కాగా స్క్రిప్టు ను రెడీ చేయించుకుని సెట్స్ కెళుతున్నారు. తాజా చిత్రం తన కెరీర్ లో ష్యూర్ షాట్ హిట్ కావాలన్నది మెగాస్టార్ ఆలోచన. అందుకు తగ్గట్టే కొణిదెల ప్రొడక్షన్స్ అధినేత రామ్ చరణ్ ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.
చిరు 152 కథాంశంపై ఇప్పటికే హింట్ దొరికింది. ఈ సినిమాని దేవాలయ భూముల కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారని .. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్ని టచ్ చేస్తున్నారని .. సామాజిక కోణంలో కథాంశం హైలైట్ అవుతుందని ప్రచారం ఉంది. అలాగే ఆచార్య అనే టైటిల్ ప్రాచుర్యంలోకి రావడం.. దేవాలయాల నేపథ్యం అన్న టాక్ పరిశీలిస్తే.. చిరు ఇందులో ఒక బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్నారా? అన్న స్పెక్యులేషన్స్ వేడెక్కిస్తున్నాయి. అలాగే ఇందులో కథానాయకుడికి ద్విపాత్రాభినయానికి ఆస్కారం ఉంది. చరణ్ కీలక పాత్రలో నటించే స్కోప్ ఉంటుందన్న ఊహాగానాలు సాగుతున్నాయి. అన్నిటికీ లాంచింగ్ డే ఏదైనా సమాధానం దొరుకుతుందేమో చూడాలి అన్న ఆసక్తి పెరిగింది.
తాజా సమాచారం ప్రకారం.. మెగా లాంచింగ్ డే ఫిక్సయ్యిందని తెలుస్తోంది. డిసెంబర్ 26న ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్ కోకాపోటలోని మెగాస్టార్ ఫామ్ హౌస్ లో ఈ సినిమా ప్రారంభమవుతుంది. మొదటి షెడ్యూల్ పూర్తిగా హైదరాబాద్ పరిసరాల్లోనే తెరకెక్కించనున్నారు. ఆ తరువాత రాజమండ్రిలో రెండో షెడ్యూల్ ని అత్యంత కీలకంగా భావిస్తున్నారు. ఇప్పటికే కొరటాల బృందం రాజమండ్రి లొకేషన్లను ఫైనల్ చేశారట. ఇక ఈ రెండో షెడ్యూల్లో చిరంజీవి సహా కీలక నటీనటులు పాల్గొంటారని తెలుస్తోంది.