Begin typing your search above and press return to search.
'మెగా' మార్పులు చేర్పులు ప్లస్సా..? మైనస్సా..?
By: Tupaki Desk | 6 Oct 2022 1:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చేసింది. తొలి ఆట నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మెగా ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాకపోతే ఆ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేకపోయిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.
'గాడ్ ఫాదర్' సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన 'లూసిఫర్' చిత్రానికి ఇది అధికారిక రీమేక్. కాకపోతే మెగాస్టార్ ఇమేజ్ మరియు ఆయన అభిమానులను దృష్టిలో ఉంచుకొని కథలో భారీ మార్పులు చేర్పులు చేశారు.
'లూసిఫర్' సినిమాని ఎన్నిసార్లు చూసినా ఎక్కడో కొంత డౌట్ డౌట్ గా ఉండేదని.. అసంతృప్తిగా అసంపూర్ణంగా ఉందనిపించిందని.. వాటిని సరిచేసి తన ఇమేజ్ కు అనుగుణంగా సంతృప్తిపరిచేలా మార్పులు చేసే దర్శకుడి కోసం వెతినట్లుగా చిరంజీవి ఇటివల ప్రెస్ మీట్ లో స్వయంగా చెప్పారు.
చిరు కోరుకున్న విధంగా దర్శకుడు మోహన్ రాజా మరియు రచయిత లక్ష్మీ భూపాల్ స్క్రిప్టులో మార్పులు చేయడంతో 'గాడ్ ఫాదర్' ను పట్టాలెక్కించారు. మార్పులు చేసిన తర్వాత ఈ సినిమాని మెగాస్టార్ తప్ప మరో హీరో సెట్ అవ్వడని.. ఒరిజినల్ వెర్సన్ హీరో మోహన్ లాల్ కూడా చేయలేరని రచయిత స్టేట్మెంట్ ఇచ్చారు.
అలానే దర్శకుడు సైతం 'గాడ్ ఫాదర్' మీద ధీమా వ్యక్తం చేశారు. 'లూసిఫర్' లో లేని ఒక కోణం ఇందులో ఉందని.. స్క్రీన్ ప్లే చాలా సర్ ప్రైజింగ్ గా.. కొత్తగా ఉంటుందని తెలిపారు. ఓపిక ఉంటే మరోసారి 'లూసిఫర్' చూసి థియేటర్లకు వచ్చినా పర్వాలేదని చెప్పాడు.
స్క్రిప్టు స్క్రీన్ ప్లేలో చేసిన మార్పులపై అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కాబట్టే.. అలాంటి స్టేట్మెంట్ ఇవ్వగలిగాడని అనుకోవాలి మోహన్ రాజా. సినిమా చూసిన తర్వాత దర్శకుడు చేసిన చేంజెస్ కచ్చితంగా మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయని అంటున్నారు.
'లూసిఫర్' లో మూల కథతో పాటు అందులోని ప్రధాన పాత్రలు - కీలక ఎపిసోడ్లను తీసుకుని.. వాటికి అదనపు పాత్రలు సన్నివేశాలతో పాటు మెగా ఫ్యాన్స్ ఆశించే అంశాలన్నీ దట్టించి 'గాడ్ ఫాదర్' ను తెరకెక్కించారు.
మాతృక నిడివి 2.50 నిమిషాలు ఉంటే.. అందులో యాభై నిమిషాలు మాత్రమే మోహన్ లాల్ కనిపిస్తారు. కానీ ఇక్కడ 'గాడ్ ఫాదర్' నిడివి తగ్గించడమే కాదు.. సినిమా అంతా చిరంజీవి కనిపించేలా స్క్రీన్ ప్లే రాసుకున్నారు.
ఒరిజినల్ లో ఉన్న తమ్ముడి పాత్ర లేపేసి.. ఇక్కడ నయనతార పాత్రకు తగినంత ప్రాధాన్యత కల్పించారు. ఆ క్యారక్టర్ ని తీసేయడం వల్ల చిరు పాత్రని ఎలివేట్ చేయడానికి అవకాశం కలిగింది. అలానే అక్కడ సవతి కూతురిని విలన్ ఇబ్బంది పెడుతున్నట్టు చూపిస్తే.. ఇక్కడ ఆ పాత్రను మరదలి పాత్రగా మార్చారు. ఇవన్నీ కూడా తెలుగు అభిమానులకు కొత్త సినిమా చూసామనే భావన కలిగిస్తున్నాయి.
అయితే 'లూసిఫర్' ఫ్యాన్స్ మాత్రం అందులో మోహన్ లాల్ ఒక అద్భుతమైన, గంభీరమైన ప్రదర్శనను చూపిస్తే.. తెలుగులో కథకు అనుగుణంగా కాకుండా.. చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా పాత్రని మలిచారని.. అందువల్ల కథలో ఆసక్తి తగ్గిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఎంతసేపూ బాస్ ని ఎలా ఎలివేట్ చేయాలనే దాని మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరించడంతో కథ మీద పట్టు సడలిందని అంటున్నారు.
పొలిటికల్ డ్రామాని మరింత పకడ్బందీగా నడిపించాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఒక రీమేక్ చేసినప్పుడు రెండు సినిమాలకి కంపేరిజన్ రావడం కామన్. అదే విధంగా తీస్తే కాపీ పేస్ట్ అంటారు.. మార్పులు చేస్తే చెడగొట్టారు అంటారు. కానీ ఇక్కడ 'గాడ్ ఫాదర్' విషయంలో అలాంటి నెగెటివ్ కామెంట్స్ రావడం లేదు.
కాకపోతే 30 కోట్లతో తీసిన 'లూసిఫర్' సినిమా.. బాక్సాఫీస్ వద్ద 175 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టింది. ఇక్కడ 'గాడ్ ఫాదర్' సినిమాకు అన్నీ కలుపుకొని 100 కోట్ల దాకా ఖర్చు అయినట్లు తెలుస్తోంది. మరి ఓవరాల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.