Begin typing your search above and press return to search.
ఈ కుర్రాళ్లలో ఒక స్టార్ హీరో ఉన్నాడు.. చెప్పుకోండి చూద్దాం..!
By: Tupaki Desk | 9 Nov 2022 12:30 PM GMTమనిషి తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోక తప్పదు. మంచి.. చెడు ఏదైనా సరే చిన్ననాటి జ్ఞాపకాలనేవి అతడి జీవితంలో మధురస్మతులుగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి బాల్య స్మృతులు తలుచుకోవడానికి.. ఆ ఆలోచనల్లోకి వెళితేనే ఎన్నో ఊహలు మన మనస్సును తట్టి లేపుతాయి.
బాల్యంలో మనం చేసిన అల్లరి.. ఆడుకున్న ఆటలు.. బాధ.. సంతోషం.. మనసులో మాట్లాడుకోవడం లాంటి ఎన్నో సంఘటనలు మన గుండె గూటిలో గూడు కట్టుకునే ఉంటాయి. ఆ రోజులు మళ్లీ రమ్మన్నా.. రాలేనివి. సోషల్ మీడియా యుగంలోనూ ప్రతి ఒక్కరూ తమ చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో సెలబ్రెటీలు సైతం తమ చిన్ననాటి జ్ఞాపకాలు అభిమానులతో పంచుకుంటున్నారు. ఈక్రమంలోనే యంగ్ హీరోహీరోయిన్స్.. అగ్ర కథా నాయకులకు సంబంధించిన చిన్న నాటి ఫొటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. వీటిని చూసి అవాక్కవుతున్న అభిమానులు వాటిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.దీంతో ఆ ఫోటోలు కాస్త ట్రెండింగ్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తాను తీసిన మొదటి ఫొటోను #FirstPhotoTaken పేరుతో ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ ఐదుగురు కుర్రాళ్లు ఉన్న ఫొటోలో మీకు తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారు.. ఎవరో చెప్పుకోండి చూద్దాం’ అంటూ పోస్ట్ చేశారు. ఇంకేముందు అభిమానులు సైతం ఆ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టి ‘పవర్ స్టార్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చిరంజీవి తమ్ముడిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. హిట్స్.. ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా పవన్ కల్యాణ్ అభిమానుల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆయన ప్లాప్ సినిమానే ఒక స్టార్ హీరో సినిమా కలెక్షన్లతో సమానంగా వస్తాయంటే టాలీవుడ్లో అతడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లోనూ.. సినిమాల్లో తీరికలేకుండా గడుపుతున్నారు. ఓవైపు ప్రజా సమస్యలపై పోరాడుతూనే మరోవైపు సినిమాలు చేస్తూ ముందుకెళుతున్నారు. ‘వకీల్ సాబ్’తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ‘బీమ్లా నాయక్’తో వరుస బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న చారిత్రక మూవీ ‘హరిహరవీరమల్లు’లో పవన్ నటిస్తున్నాడు. పవన్ నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. ఈ మూవీలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. అలాగే హరీష్ శంకర్ తో ‘భవధీయుడు భగత్ సింగ్’ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే పవన్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండటంతో ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది సస్పెన్స్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.