Begin typing your search above and press return to search.
అమితాబ్ త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ ట్వీట్
By: Tupaki Desk | 12 July 2020 4:15 AM GMTబాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కి ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కి కరోనా పాజిటివ్ అని తేలగానే అటు అభిమానులు సహా ఇటు సెలబ్రిటీలు ఎంతో ఆందోళన చెందారు. ముఖ్యంగా అమితాబ్ కి ఎంతో సన్నిహితుడైన మెగాస్టార్ చిరంజీవి వెంటనే ట్విట్టర్ లో స్పందించారు.
అమిత్ జీ త్వరగా కోలుకోవాలని చిరంజీవి ప్రార్థించారు. ``ఆల్ అవర్ బెస్ట్ విషెస్ అండ్ హార్టీ ప్రేయర్స్ విత్ యు అమిత్ జీ.. సీనియర్ బచ్చన్ గెట్ వెల్ సూన్`` అంటూ ట్వీట్ చేశారు. ఇక చిరుతో అమితాబ్ సాన్నిహిత్యం గురించి చెప్పాల్సిన పనే లేదు. ఓవైపు 76 ఏళ్ల వయసులో తన ఆరోగ్యం సహకరించకపోయినా చిరు కోరిక మేరకు అమితాబ్ సైరాలో నటించేందుకు అంగీకరించారు. హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ సెట్స్ లో చిత్రీకరణలో పాల్గొన్నారు. అంతటి అభిమానం ఇరువురు మెగాస్టార్ల మధ్యా ఉంది.
చిరు వేరొక ట్వీట్ లో శివన్ అనే పోస్ట్ మ్యాన్ హార్డ్ వర్క్ .. డెడికేషన్ ని ప్రశంసించడం హాట్ టాపిక్ గా మారింది. కేరళ కూనూర్ కు చెందిన శివన్ అనే పోస్ట్ మ్యాన్ రోజూ ఓ దట్టమైన అడవి మార్గం గుండా 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి గ్రామాల్లో ఉత్తరాల్ని పంచుతున్నారు. సాహు సుప్రియ అనే ఐఏఎస్ అతడి గురించి ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ కి చిరు రెస్పాండ్ అయ్యారు. ``ఎవరైనా చేసే పనిని సమర్థంగా చేస్తేనే అత్యంత సంతృప్తిని పొందుతారు. ఇలాంటి వాళ్ల వల్లే మానవత్వం బతుకుతుంది`` అంటూ చిరు ట్వీట్ చేశారు.