Begin typing your search above and press return to search.
వెయిటింగ్ అంటున్న మెగా స్టార్.. ?
By: Tupaki Desk | 11 Dec 2021 4:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి చూడని ఎత్తులు లేవు. ఆయన ఎక్కని శిఖరాలు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికీ అందనంత ఎత్తున ఆయన శిఖరం మీద నిలిచి చాలా దశాబ్దాలు అయింది. మెగాస్టార్ కి సినిమా అంటే పాషన్. ఆయన తన సినిమాతో మాత్రమే సరిపెట్టుకోకుండా అన్ని సినిమాలను చాలా జాగ్రత్తగా గమనిస్తారు. ఆయన ఎప్పటికపుడు మారుతున్న ట్రెండ్ ని కూడా పరిశీలిస్తారు.
ఇక ఆయనలో గొప్ప జడ్జి ఉన్నారు. తన సినిమాతో పాటు ఏ సినిమా హిట్ అవుతుంది, లేదా దాని జాతకం ఏంటి అన్నది మెగాస్టార్ ఇట్టే చెప్పేయగలరు. ఇపుడు ఆయన ఒక సినిమా విషయంలో మాత్రం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతే కాదు ఆ మూవీ రిలీజ్ తో అద్భుతమే ఆవిష్కృతం అవుతుంది అని గట్టిగా నమ్ముతున్నారు.
ఆ సినిమావే ట్రిపుల్ ఆర్. ఈ మూవీ ప్రభంజనం సృష్టిస్తుంది అన్నది మెగాస్టార్ ప్రగాఢమైన విశ్వాసం. లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ ని చూసే ఆయన సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతోందో చెప్పేశారు. ఈ మూవీ సృష్టించే ప్రభజనం కోసం నేను ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను అని మెగాస్టార్ అంటున్నారు అంటే ట్రిపుల్ ఆర్ మూవీ కి ఇక ఏం కావాలి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కా బాప్ అని ఏనాడో డిసైడ్ అయిపోయింది. ఇపుడు మెగాస్టార్ లాంటి వారే తాము చూడాలనుకునే సినిమా ఇదే సుమా అని చెప్పడంతో ఇంకా అంచనాలు పెరిగిపోతున్నాయి.
మెగాస్టార్ వెయిటింగ్ సినిమాను చూడడం కోసమే కాదు, అది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సరికొత్త సంచలనాలు నమోదు చేస్తుందో అన్న ఆసక్తితో కూడా ఆయన ఉండడాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. బాహుబలి ముందూ తరువాత అన్నట్లుగా తెలుగు సినిమా హద్దులు చెరిపేసి ఖండాంతరాలలో తెలుగు జెండాను ఎగరేసి ప్రతి తెలుగు హృదయం గర్వించేలా చేసిన రాజమౌళి ట్రిపుల్ ఆర్ తో ఇంకెన్ని హద్దులు దాటేస్తాడో, మరెన్ని అంచులకు చేరి రికార్డులు బద్ధలు కొడతాడో అన్న చర్చ అయితే యావత్తు భారతీయ సినీ పరిశ్రమలోనే ఉంది.
చిరంజీవి ప్రభంజనం అన్న మాట వాడి ఇపుడు వేడిని బాగా పెంచేశారు. ఇక మీదట ఏ భారతీయ సినిమా గురించి అయినా చెప్పాలీ అంటే బెంచ్ మార్క్ గా ట్రిపుల్ ఆర్ నిలిచి ఉంటుంది అన్నది మాత్రం ఖాయం అంటున్నారు. పాన్ ఇండియా మూవీస్ కి సరికొత్త అర్ధాన్ని కూడా ట్రిపుల్ ఆర్ చెబుతుంది అని సినీ మేధావులు గట్టి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి సినిమాలు తీస్తారు, చూస్తారు, కానీ సినీ పరిశ్రమలో దాదాపు అర్ధ శతాబ్ద కాలంగా ప్రయాణం చేస్తూ వస్తున్న మెగాస్టార్ లాంటి వారు మేము చూడాలనుకునే సినిమా ఇదీ అంటూ ట్రిపుల్ ఆర్ గురించి చెప్పిన మాటలు వింటే ఇక కామన్ మాన్ అసలు ఆగగలడా.
అంటే టోటల్ భారత దేశంలో సినీ గోయర్స్ అంతా ఒక్కసారి అయినా థియేటర్ కివెళ్లే చూసే సినిమా కచ్చితంగా ట్రిపుల్ ఆర్ అవుతుంది అంటున్నారు. అదే జరిగితే కలెక్షన్లను సునామీ అనాలా. లేక ప్రభంజనం అనాల లేక అంతకు మించి వేరే మాట వాడాలా. ఏమో రేపటి రోజున ట్రిపుల్ ఆర్ గ్రాండ్ విక్టరీ గురించి రాసేందుకు పదాలను ఇప్పటి నుంచే వెతుక్కోవడం బెటరేమో.