Begin typing your search above and press return to search.

రాంచరణ్ కు 'జపాన్' అభిమానుల 'మెగా' ట్రీట్..!

By:  Tupaki Desk   |   21 Oct 2022 12:30 PM GMT
రాంచరణ్ కు జపాన్ అభిమానుల మెగా ట్రీట్..!
X
మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' విదేశాల్లో సత్తా చాటబోతుంది. ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ అంతే స్థాయిలో వసూళ్లను రాబట్టింది.

ఇప్పుడు జపాన్లోనూ 'ఆర్ఆర్ఆర్' ప్రభంజనం సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా 'ఆర్ఆర్ఆర్' టీం జపాన్ కి వెళ్లిన సంగతి తెల్సిందే.

రాంచరణ్ కు ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సౌత్ ఇండియన్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడే జపానీయులు మన స్టార్ హీరోలను అనుకరిస్తూ ఉంటారు.

తమిళ సూపర్ స్టార్ రజనీ తర్వాత ఆ స్థాయిలో రాంచరణ్, ఎన్టీఆర్ లకు క్రేజ్ ఉంది. దీంతో రాంచరణ్ నటించిన చిత్రాలు సైతం అక్కడి భాషలో డబ్బింగ్ అవుతూ ఉంటాయి.

ఇండియాలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'ఆర్ఆర్ఆర్'ను జపాన్ భాషలోనూ విడుదలవుతోంది. ఈక్రమంలోనే 'ఆర్ఆర్ఆర్' బృందం జపాన్లో ప్రమోషన్ చేపడుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రాంచరణ్, ఉపాసన దంపతులకు అక్కడి వారి నుంచి విశేష స్పందన లభిస్తోంది.

జపాన్ రాజధాని టోక్యోలోని ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ను రాంచరణ్, ఉపాసన సందర్శించారు. అక్కడి విద్యార్థులతో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాంచరణ్, ఉపాసన దంపతులకు జపాన్ విద్యార్థులు వారి పెంపుడు జంతువు రైమ్ ను పోలిన కొన్ని బొమ్మలను బహుమతులుగా ఇచ్చారు. తమపై ఎంతో ప్రేమనురాగాలను కనబర్చిన విద్యార్థులతో రాంచరణ్ దంపతులకు సెల్పీలుగా దిగడంతోపాటు చాలాసేపు అక్కడే గడిపారు.

ఇదిలా ఉంటే 'ఆర్ఆర్ఆర్' టీంతో కలిసి విద్యార్థులు థియేటర్లో సినిమా చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.