Begin typing your search above and press return to search.
సంక్రాంతి లక్ష్యంగా #MEGA154 డబ్బింగ్ ప్రారంభం..!
By: Tupaki Desk | 14 Oct 2022 5:49 AM GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు.
ఇటీవల వైజాగ్ షెడ్యూల్ ని పూర్తి చేసిన మేకర్స్.. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుతున్నారు. ఓ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. తాజా అప్డేట్ ఏమిటంటే.. ఈరోజు మెగాస్టార్ 154వ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను చిత్ర బృందం ప్రారంభించింది.
#Mega154 డబ్బింగ్ ఫార్మాలిటీస్ శుక్రవారం ఉదయం పూజా కార్యక్రమంతో ప్రారంభించినట్లుగా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే.. ముందుగా ప్రకటించినట్లుగా 2023 సంక్రాంతికి సినిమాని విడుదల చేసే విధంగా ప్లాన్ చేసి, షెడ్యూల్ ప్రకారం పనులు జరుపుతున్నారని తెలుస్తోంది.
అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మెగా154 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా కమర్షియల్ బొనాంజా అందించడానికి మెగా-మాస్ పూనకాలు లోడ్ అవుతున్నాయని మేకర్స్ పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన చిరంజీవి ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.
డైరెక్టర్ బాబీ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తుండగా.. ప్రముఖ రచయిత కోన వెంకట్ - కె.చక్రవర్తి రెడ్డి కలిసి స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. హరి మోహన కృష్ణ మరియు వినీత్ పొట్లూరి కూడా రైటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. దీనికి నిరంజన్ దేవరమానే ఎడిటర్ గా.. సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.
మెగా154 చిత్రానికి ''వాల్తేరు వీరయ్య'' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టినట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు. మరి మేకర్స్ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేస్తారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.