Begin typing your search above and press return to search.

హీరోగారి భార్య పుట్టిన రోజు సెల‌బ్రేట్ చేస్తున్న మెగాఫ్యాన్స్‌

By:  Tupaki Desk   |   19 July 2022 8:30 AM GMT
హీరోగారి భార్య పుట్టిన రోజు సెల‌బ్రేట్ చేస్తున్న మెగాఫ్యాన్స్‌
X
రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `RRR`. ఇందులో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీతో ఇద్ద‌రు హీరోల‌కు వ‌ర‌ల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు ల‌భించింది.

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఏకంగా 1200 కోట్ల మేర క‌లెక్ష‌న్ ల‌ని ద‌క్కించుకుంది. ఇక ఇటీవ‌ల పాపుల‌ర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుద‌లైన ఈ మూవీ అక్క‌డ కూడా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

ఈ మూవీని ప్ర‌త్యేకంగా వీక్షించిన హాలీవుడ్ స్టార్స్ రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఏ హాలీవుడ్ రైట‌ర్ ఏకంగా రామ్ చ‌ర‌ణ్ కోసం క‌థ‌ని సిద్ధం చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం విశేషం. ఈ సినిమాతో చ‌ర‌ణ్ మ‌రింత‌గా ఫేమ్ ని, నేమ్ ని సొంతం చేసుకున్నాడు. ఇటీవ‌ల అమృత్ స‌ర్ లో జ‌రిగిన శంక‌ర్ మూవీ షూటింగ్ సంద‌ర్భంగా అక్క‌డి పోలీస్ శాఖ వారు చ‌రణ్ తో సెల్ఫీలు దిగ‌డానికి పోటీప‌డ‌టం విశేషం. చ‌ర‌ణ్ స్టార్ డ‌మ్ లో మార్పుల‌ని చూసిన మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల‌వుతున్నార‌ట‌.

చ‌ర‌ణ్ కు సంబంధించిన ప్ర‌తీ విష‌యాన్ని ఇక నుంచి ప్ర‌త్యేకంగా సెల‌బ్రేట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ ని నెల రోజుల ముందే ప్ర‌త్యేకంగా ప్లాన్ చేస్తూ స‌ర్ ప్రైజ్ చేస్తున్న అభిమానులు ఇప్ప‌డు కొత్త‌గా ఆయ‌న వైఫ్ ఉపాస‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ని కూడా ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తుండ‌టం విశేషం. జూలై 20న రామ్ చ‌ర‌ణ్ వైఫ్ ఉపాస‌న పుట్టిన రోజు జ‌రుపుకోబోతున్నారు.

ఈ రోజుని మెగా ఫ్యాన్స్ రాష్ట్ర రామ్ చ‌ర‌ణ్ యువ‌శ‌క్తి ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేకంగా సెల‌బ్రేట్ చేయ‌బోతున్నారు. ఇందు కోసం ఏర్పాట్ల‌ని కూడా మొద‌లు పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ప్ర‌త్యేకంగా ఇన్విటేష‌న్ ని కూడా ఏర్పాటు చేశారు. `శ్రీ‌మ‌తి కొణిదెల ఉపాస‌న గారి బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్` పేరుతో ప్ర‌త్యేక ఇన్విటేష‌న్ ని ప్రింట్ చేయించారు. పుట్టిన రోజు ఉద‌యం ప్ర‌త్యేకంగా రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌నల పేరు మీద ప్ర‌త్యేక పూజాలు జ‌రిపించ‌బోతున్నారు. మొక్క‌ల‌ని నాటే కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తార‌ట‌.

అనంత‌రం అనాధాశ్ర‌మాల్లో అన్న‌దాన కార్య‌క్ర‌మాల‌ని ఏర్పాటు చేబోతున్నారు. అంతే కాకుండా ఇటీవ‌ల కురిసిన అకాల వ‌ర్షాల‌కు వ‌ర‌ద‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న వారికి కావాల్సిన వ‌స్తువుల‌ని అందించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్న‌ట్టుగా తెలిసింది. ఇవ‌న్నీ రాష్ట్ర రామ్ చ‌ర‌ణ్ యువ‌శ‌క్తి ఆధ్వ‌ర్యంలో జూలై 20 బుధ‌వారం జ‌ర‌గ‌నున్నాయి.