Begin typing your search above and press return to search.
చరణ్ విషయంలో అభిమానుల ఆందోళన అందుకే
By: Tupaki Desk | 23 April 2021 5:08 AM GMTమహమ్మారీ సెకండ్ వేవ్ విజృంభణ ప్రజల్ని భయపెడుతోంది. మొదటి వేవ్ ని మించి వేగంగా విస్తరిస్తున్న కరోనా సామాన్య ప్రజలతో పాటు అన్ని పరిశ్రమల్ని వెంటాడుతోంది. ముఖ్యంగా సినీపరిశ్రమ భారీ మూల్యం చెల్లించుకుంటోంది.
మహమ్మారీకి భయపడక.. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగులు చేస్తున్న పలువురు స్టార్లు తమ వ్యక్తిగత సహాయకులకు సాటి నటీనటులకు సాంకేతిక నిపుణులకు పాజిటివ్ రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. ఇందులో రామ్ చరణ్ కూడా ఉన్నారు. ఆయన ఇంతకుముందు కోవిడ్ పాజిటివ్ వచ్చిన సోనూసూద్ ను ఆచార్య సెట్స్ లో కలిసారు. సోనూసూద్ కి పాజిటివ్ అని తెలియగానే చెర్రీ అప్రమత్తమై స్వీయనిర్భంధంలోకి వెళ్లారు.
క్వారంటైన్ లోకి వెళ్లారు అని తెలిసిన మరుసటిరోజే చరణ్ కారవ్యాన్ డ్రైవర్ మృతి చెందారని తెలిసి అభిమానులు తీవ్రంగా కలతకు గురయ్యారు. కోవిడ్ తో అతడు మరణించడమే అందుకు కారణం. చరణ్ ఆరోగ్యంగా ఉండాలని ప్రస్తుతం మెగాభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఓవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి కోవిడ్ పాజిటివ్ రావడంతో మెగా కాంపౌండ్ చాలా అప్రమత్తమైంది. ఇప్పుడు చరణ్ విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. అపోలో వైద్య బృందాలు ఎప్పుడూ వీరికి అందుబాటులో ఉండడం కొంత ఊరట అని అభిమానులు భావిస్తున్నారు. చరణ్ కి మొదటి వేవ్ సమయంలో ఒకసారి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అందుకే అభిమానుల్లో ఆందోళన తగ్గడం లేదు. తగు జాగ్రత్తలతో స్వీయ ఒంటరితనంతో దీని నుంచి దూరంగా ఉండడం సాధ్యమని భావిస్తున్నారు. ఇక ఆచార్య సెట్స్ లో కొందరికి పాజిటివ్ అని తేలడంతో షూటింగుని నిలిపివేసిన చిరు సహా ఇతర టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.