Begin typing your search above and press return to search.
ప్రస్తుతానికి మెగాహీరో సేఫ్.. ఫ్యూచర్ ఏంటో..??
By: Tupaki Desk | 2 Feb 2021 2:30 AM GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త సినిమాల రిలీజ్ డేట్ల గోల అసలు ఆగేలా లేదు. గతవారం నుండి తెలుగు సినిమాల దర్శకనిర్మాతలు తమ సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఏడాదిలో ఏ శుక్రవారం కూడా ఖాళీగా లేదని అర్ధమవుతుంది. ఇప్పటికే ఇరవైకి పైగా సినిమాలు రిలీజ్ డేట్ ఖరారు చేసాయి. తాజాగా మెగాహీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న రిపబ్లిక్ సినిమా డేట్ కూడా ప్రకటంచారు మేకర్స్.
వినూత్న సినిమాల దర్శకుడు దేవాకట్ట.. భారీ గ్యాప్ తీసుకొని తెలుగు సినిమా చేస్తున్నాడు. ఆయన ఇదివరకు సంజయ్ దత్ ప్రధానపాత్రలో ప్రస్థానం సినిమాను హిందీలో రీమేక్ చేసాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఇక తాజాగా మెగామేనల్లుడు సాయిధరమ్ హీరోగా ఫస్ట్ టైం పొలిటికల్ మూవీ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ అద్భుతమైన బజ్ క్రియేట్ చేసింది.
ఈ సినిమాలో శివగామి రమ్యకృష్ణ విలన్ పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం రమ్యకృష్ణ ఈ సినిమాలో సీఎం పాత్ర పోషిస్తుందని టాక్. బాహుబలి తర్వాత అంతటి బలమైన పాత్ర చేస్తుందని అంటున్నారు. చిత్రలహరి, ప్రతిరోజూ పండగే హిట్ల తర్వాత రీసెంట్ గా తేజ్.. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో పర్వాలేదనిపించాడు. ఈ సినిమాలో సాయితేజ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చేస్తున్న రిపబ్లిక్ మూవీని జూన్ 4న విడుదల చేయనున్నారు.
ఈ సినిమాకు ఒక వారం ముందు అంటే మే 28న బాలయ్య - బోయపాటిల మూడో సినిమా, మాస్ రాజా రవితేజ ఖిలాడి సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే బాలయ్య, రవితేజల రేస్ నుండి తప్పుకొని సాయితేజ్ మంచిపని చేసాడని ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఏ హీరోకి కూడా సోలో డేట్ దొరకలేదు. మరి ఈ లెక్కన సాయితేజ్ రిపబ్లిక్ మూవీకి ప్లస్ అనే చెప్పాలి. మరి చూడాలి ముందుముందు వేరే సినిమా ఏదైనా పోటీకి రానుందేమో.. రిపబ్లిక్ మూవీ ఎలా అలరిస్తుందో చూడాలి!