Begin typing your search above and press return to search.
చిరు కూడా సెటిల్మెంట్ కి రెడీ అవుతున్నారా?
By: Tupaki Desk | 12 May 2022 11:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'ఆచార్య' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ ఏప్రిల్ 29న విడుదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై చిరు కెరీర్ లో అత్యంత డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ రిలీజ్ తరువాత మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో కలిసి వేసవి వెకేషన్ కోసం ప్రత్యేకంగా యుఎస్ వెళ్లిన విషయం తెలిసిందే. ప్రత్యేక జెట్ విమానంలో చిరు ఫ్యామిలీతో కలిసి యుఎస్ కు వెళ్లిపోయారు.
తాజాగా ఆయన తన యుఎస్ వెకేషన్ ని ముగించుకుని హైదరాబాద్ తిరిగి రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ మొదటి వారంలో చిరు హైదరాబాద్ కు చేరుకుంటారట. ఈ నేపథ్యంలో 'ఆచార్య' కారణంగా నష్టాపోయిన బయ్యర్లపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇటీవల బెంగళూరుకు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా చిరుకే 'ఆచార్య' నష్టాలపై మమ్మల్ని గట్టెక్కించమంటూ ఓపెన్ లెటర్ రాయడం తీవ్ర కలకలం రేపింది. అతని తరహాలోనే మిగతా డిస్ట్రిబ్యూటర్లు కూడా చిరుకు తమ విన్నపాలని వివరించే ప్రయత్నాలు చేశారు.
కానీ చిరు ఫ్యామిలీలో యుఎస్ కు వెళ్లిపోవడంతో వీటిపై స్పందించలేదు. జూన్ మొదటి వారంలో హైదరాబాద్ రానున్న మెగాస్టార్ 'ఆచార్య' సెటిల్మెంట్ కి రెడీ అవుతారని చెబుతున్నారు. ఇప్పటికే నిర్మాత నిరంజన్ రెడ్డి తన వంతు కొంత అమౌంట్ ని బయ్యర్లకు రిటర్న్ చేశారట. అలాగే కొరటాల శివ కూడా తన రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని బయ్యర్లకు తిరిగి ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక మిగిలింది మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్.
ఈ ఇద్దరి నుంచి ఎంతో కొంత రిటర్న్ లభిస్తే భారీ స్థాయిలో నష్టాలని చవిచూసిన డిస్ట్రిబ్యూటర్లకు కొంత ఉపశమనం లభిస్తుందన్నది చాలా మంది వాదన. చిరు ఇలాంటి విషయాల్లో ముందే వుంటుంటారు. కాబట్టి ఆయన నుంచి రావాల్సిన మొత్తం తిరిగి వచ్చేస్తుందని చాలా మంది చెబుతున్నారు.
డిస్ట్రి బ్యూటర్లు కూడా ఈ ఇద్దరిపైనే ఆశలు పెట్టుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఆచార్య' అంచనాలకు అందని స్థాయిలో డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ఫలితంగా 80 శాతం నష్టాలని డిస్ట్రిబ్యూటర్లకు అందించిందట.
దీంతో తమని నష్టాల నుంచి బయటపడేసేది చిరునే అని డిస్ట్రిబ్యూటర్లు గట్టి నమ్మకంతో వున్నారట. యుఎస్ నుంచి చిరు తిరిగి రాగానే ఏదో ఒక సెటిల్మెంట్ అయితే గ్యారెంటీగా జరుగుతుందని, ఇందుకు చిరు హామీ ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సెటిల్మెంట్ పైనే చిరు చేస్తున్న 'గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల రిలీజ్ లు ఆధారపడి వున్నాయి. అందు కోసమైనా డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్ కు చిరు పరిష్కారం చూపక తప్పదని తెలుస్తోంది.