Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌ భారం అంతా వీర‌య్య‌పైనే!

By:  Tupaki Desk   |   13 Nov 2022 2:30 AM GMT
మెగాస్టార్‌ భారం అంతా వీర‌య్య‌పైనే!
X
'ఘ‌రానా మొగుడు' త‌రువాత మెగాస్టార్ చిరంజీవి 'ఆప‌ద్భాంధ‌వుడు' నుంచి 'రిక్షావోడు' వ‌ర‌కు వ‌రుస ఫ్లాపుల్ని చూశారు. త‌న‌కు అచ్చివ‌చ్చిన ద‌ర్శ‌కుడు విజ‌య‌బాపినీడుతో చేసిన 'బిగ్ బాస్‌' కూడా డిజాస్ట‌ర్ గా నిలిచి చిరుని క‌ల‌వ‌ర‌పెట్టింది. ఇలా వ‌ర‌స‌గా ఎడెనిమిది ఫ్లాపుల్ని చిరు ఎదుర్కోవ‌డంతో ఇక చిరు కెరీర్ ముగిసిన‌ట్టేన‌నే వ‌దంతులు వినిపించాయి. చిరు సినిమాల శ‌కం ముగిసిన‌ట్టేన‌ని ఇండస్ట్రీ వ‌ర్గాలు కూడా నిట్టూర్చాయి. ఆ స‌మ‌యంలో ఎడిట‌ర్ మోహ‌న్ తానే నిర్మాత‌గా మెగాస్టార్ చిరంజీవిని కొత్త కోణంలో ఆవిష్క‌రిస్తూ నిర్మించిన మూవీ 'హిట్ల‌ర్‌'.

1997లో విడుద‌లైన ఈ మూవీకి కుటుంబ క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు ముత్యాల సుబ్బ‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఐదుగురు చెల్లెళ్ల‌కు అన్న‌య్య‌గా అంతా హిట్ల‌ర్ అని పిలుచుకునే పాత్ర‌లో చిరు న‌టించిన ఈ మూవీ అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా చిరుని మ‌ళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. త‌న‌లో ఇంకా స‌త్తా త‌గ్గ‌లేద‌ని, చిరు కెరీర్ ఇంకా వుంద‌ని నిరూపించి బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ కాసుల వ‌ర్షం కురిపించి చిరు స‌త్తాని మ‌రో సారి చూపించింది.

అక్క‌డి నుంచి చిరు కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డి వ‌రుస హిట్ల‌తో సాఫీగా సాగ‌డం మొద‌లు పెట్టింది. మ‌ళ్లీ 2007లో 'శంక‌ర్ దాదా జిందాబాద్‌' త‌రువాత చిరు సినిమాకు బ్రేకిచ్చి ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించి సినిమాల‌కు దూరం అయ్యారు. దాదాపు ప‌దేళ్ల విరామం త‌రువాత మ‌ళ్లీ 'ఖైదీ నం.150'తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ 'క‌త్తి' ఆధారంగా తెర‌కెక్కిన ఈ మూవీ సంచ‌ల‌న విజ‌యాన్ని అందించిన వంద కోట్ల క్ల‌బ్ లో చేరి ఇన్నేళ్ల‌యినా చిరు క్రేజ్ త‌గ్గ‌లేద‌ని నిరూపించింది.

అయితే ఆ త‌రువాత నుంచే చిరు ఆ మార్కు విజ‌యాల్ని ద‌క్కించుకోలేక‌పోతున్నారు. సైరా చేసినా.. ఫ‌లితం లేకుండా పోయింది. ఆ త‌రువాత న‌టించిన 'ఆచార్య‌' మ‌రీ డిజాస్టర్ అనిపించుకుని షాకిచ్చింది. చ‌ర‌ణ్ తో న‌టించాల‌న్న కోరిక కార‌ణంగా ఈ మూవీ గాడిత‌ప్పింద‌నే కామెంట్ లు ఇప్ప‌టికీ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తూనే వున్నాయి. రీసెంట్ గా విడుద‌లైన రీమేక్ మూవీ 'గాడ్ పాద‌ర్‌' హిట్ టాక్ ని ద‌క్కించుకున్నా ఆశించిన స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక‌పోయింది.

ఈ నేప‌థ్యంలో చిరు ఆశ‌ల‌న్నీ వీర‌య్య‌పైనే పెట్టుకున్నాడ‌ని తెలుస్తోంది. చిరు న‌టిస్తున్న లేటెస్ట్ మాస్ మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్ 'వాల్తేరు వీర‌య్య‌'. బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఎలాగైనా ఈ మూవీతో వంద కోట్ల క్ల‌బ్ లో చేరాల‌ని చిరు ఆశ‌గా ఎవురుచూస్తున్నాడు. ఇదే స‌మ‌యంలో బాల‌కృష్ణ న‌టిస్తున్న 'వీర సింహారెడ్డి' కూడా బ‌రిలో పోటికి దిగుతోంది. ఈ నేప‌థ్యంలో బాల‌య్య‌ని అధిగ‌మించి 'వీర‌య్య‌తో వంటి కోట్ల ఫీట్ ని రిపీట్ చేయ‌డం కొంత క‌ష్ట‌మే అయినా ప్రేక్ష‌కుల‌కు ఆశించిన కంటెంట్ ని అందించ‌గ‌లిగే ఖ‌చ్చితంగా ఆ ఫీట్ ని రిపీట్ చేయ‌డం చిరుకు అంత క‌ష్ట‌మేమీ కాద‌ని చెబుతున్నారు. అంతా ఆశించిన‌ట్టే చిరు 'వాల్తేరు వీర‌య్య‌'తో వంద కోట్ల ఫీట్ ని రిపీట్ చేసి మ‌రోసారి త‌న స‌త్తాని చాటుకుంటాడా? అన్న‌ది తెలియాలంటే సంక్రాంతి రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.