Begin typing your search above and press return to search.

మెగా సెలబ్రేషన్స్ తో 'మెగాస్టార్' అంటే ఏంటో చూపిస్తారా..?

By:  Tupaki Desk   |   10 Aug 2022 3:58 AM GMT
మెగా సెలబ్రేషన్స్ తో మెగాస్టార్ అంటే ఏంటో చూపిస్తారా..?
X
మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. సినిమాల్లో హిట్లు ప్లాప్స్ అనేవి సర్వసాధారణం. మెగా హీరోల కెరీర్ లో గతంలో అనేక ప్లాప్స్ ఉన్నాయి. కానీ 'ఆచార్య' స్థాయిలో దారుణ పరాజయమైతే చవిచూడలేదు. రెండో రోజే థియేటర్లు ఖాళీగా కనిపించే పరిస్థితి ఎప్పుడూ రాలేదు.

'ఆచార్య' సినిమా చిరు - చరణ్ కెరీర్ లోనే కాదు.. టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల్లో టాప్ లో నిలిచింది. దీంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశలో వున్నారు. తొలిసారిగా మెగా తండ్రీకొడుకులు కలిసి నటించిన పూర్తి స్థాయి సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఫలితం మాత్రం వారు ఆశించిన విధంగా రాలేదు.

అప్పుడప్పుడు తన ప్రమేయం లేకుండా మిస్టేక్స్ జరిగిపోతుంటాయిని చిరు సర్దిచెప్పుకోవచ్చు కానీ.. మెగా అభిమానులు మాత్రం ఈ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీని ఏలిన మెగాస్టార్ ఇమేజ్.. ఇప్పుడు ఒక్క డిజాస్టర్ తో పడిపోయిందనే విధంగా యాంటీ ఫ్యాన్స్ చేసే కామెంట్స్ వారిని ఇబ్బంది పెడుతున్నాయి.

లేటెస్టుగా 'బింబిసార' సినిమా హిట్టయ్యాక ఓ వర్గం యాంటీ ఫ్యాన్స్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ స్థాయి చిరంజీవి ని దాటిపోయిందనేలా ట్వీట్స్ పెడుతున్న సంగతి తెలిసిందే. 'మెగాస్టార్' అనే ట్యాగ్ కూడా చిరు కి సరికాదనే విధంగా అర్ధం లేని ట్విట్టర్ క్యాంపైన్ చేస్తున్నారు.

పాండమిక్ తర్వాత చిరంజీవి - రామ్ చరణ్ కలిసి 'ఆచార్య' తో ప్లాప్ అందిస్తే.. కష్ట కాలంలో ఉన్నప్పుడు కళ్యాణ్ రామ్ తన 'బింబిసార' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఊపిరి పోసాడని ట్రోల్ చేస్తున్నారు. శిఖరమంత ఇమేజ్ ఉన్న చిరంజీవి ని ఇతర హీరోలతో కంపేర్ చేసే పరిస్థితి రావడం.. దీనిపై సోషల్ మీడియాలో వ్యతిరేక వర్గాన్ని డిపెండ్ చేయాల్సి రావడంపై మెగా ఫ్యాన్స్ కలత చెందుతున్నారని తెలుస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. మెగాస్టార్ తన సత్తా ఏంటో.. స్టార్ పవర్ ఎంతనేది మరోసారి చూపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. యాంటీ ఫ్యాన్స్ కు సరైన కౌంటర్ ఇవ్వాలని వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో చిరంజీవి పుట్టినరోజు రాబోతోంది.

మెగా అభిమానులు సెలబ్రేషన్స్ కు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. ఈసారి వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చిరంజీవి రేంజ్ ఏంటో బర్త్ డే సెలబ్రేషన్స్ తోనే తెలియజెప్పాలని గట్టిగా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. మెగా స్వాగ్ ఎప్పటికీ తగ్గదని నిరూపించేలా ప్రమోషనల్ మెటీరియల్ సిద్ధం చేస్తున్నారని సమాచారం.

ఇప్పటికే మెగాస్టార్ ఓ స్పెషల్ ఫోటో షూట్ చేసిన సంగతి తెలిసిందే. అలానే మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి ప్రస్తుతం చిరు నటిస్తున్న సినిమాల నుంచి స్పెషల్ టీజర్లు పోస్టర్స్ తో సందడి చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న 'గాడ్ ఫాదర్'.. మెహర్ రమేష్ తో 'భోళా శంకర్'.. బాబీ డైరెక్షన్ లో 'వాల్తేర్ వీరయ్య' సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేయడానికి రెడీ అవుతున్నాయి.

మరోవైపు ఎప్పటిలాగే సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ప్లాన్స్ చేస్తున్నారు. ఇలా ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ లో గ్రాండ్ మెగా బర్త్ డే సెలబ్రేషన్స్ తో మెగాస్టార్ అంటే ఏంటో చూపించాలని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారని తెలుస్తోంది.