Begin typing your search above and press return to search.

మెగాస్టార్ బాక్సాఫీస్ ట్రాక్.. ఇది న్యూ రికార్డ్!

By:  Tupaki Desk   |   20 Jan 2023 8:44 AM GMT
మెగాస్టార్ బాక్సాఫీస్ ట్రాక్.. ఇది న్యూ రికార్డ్!
X
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, రవితేజ ప్రధాన పాత్రలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీని విడుదలైన సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా విడుదలై వారం రోజుల పూర్తి థియేట్రికల్ రన్ పూర్తయింది. మొత్తం మీద ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వాల్తేరు వీరయ్య సినిమా 96.46 కోట్ల షేర్ వసూలు చేయగా... 160.45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

అయితే ఆచార్య సినిమా భారీ డిజాస్టర్ అయిన తర్వాత విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా కూడా పెద్దగా వసూళ్లు తీసుకురాకపోవడంతో వాల్తేరు వీరయ్య సినిమా మీద అందరి ఆసక్తి నెలకొంది. ఈ సినిమా అందరి అంచనాలను దాటేసి మరీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి చివరి నాలుగు సినిమాల మొదటి వారం వసూళ్లు ఎలా ఉన్నాయి అనే విషయం మీద ఒకసారి లుక్ వేసే ప్రయత్నం చేద్దాం.

ముందుగా వాల్తేరు వీరయ్య సినిమా కంటే ముందు విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా వారం రోజుల్లో 53.10 కోట్ల షేర్, 96.35 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా... ఎందుకో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చూసేందుకు ఆసక్తి చూపించలేదు. అందుకే సినిమా వసూళ్ల మీద భారీ ఎఫెక్ట్ పడింది.. ఇక అంతకు ముందు రిలీజ్ అయిన ఆచార్య సినిమా మొదటి రోజు వసూళ్లు బాగానే వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ సినిమా కావడంతో సినిమా అద్భుతంగా ఉంటుందని మొదటి రోజు బుకింగ్స్ అందరూ చేసుకున్నారు.

అయితే మొదటి ఆట నుంచి డిజాస్టర్ టాక్ రావడంతో రెండో రోజు సినిమా బుకింగ్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో వారం రోజులపాటు ఈ సినిమా కేవలం 43.87 కోట్ల షేర్ 75.05 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

ఇక అంతకు ముందు విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమా విషయానికి వస్తే మొదటి వారం రోజుల్లో 115.38 కోట్ల షేర్, 188.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా కంటే ముందు విడుదలైన ఖైదీ నెంబర్ 150 సినిమా 77.32 కోట్లు షేర్ 111.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

అయితే ఈ అన్ని సినిమాలను కంపేర్ చేసుకుంటే సైరా నరసింహారెడ్డి సినిమాకి ఎక్కువ వసూళ్లు వచ్చినా... అది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యింది. అయినా అన్ని భాషల కలెక్షన్లు కలుపుకొని 115 కోట్లు వచ్చాయి. కానీ ప్రస్తుత సినిమా మాత్రం తెలుగు హిందీ వర్షన్ లోనే విడుదలై ఈ మేర వసూళ్లు రాబట్టడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.