Begin typing your search above and press return to search.
ఆచార్యతో పుష్పరాజ్ సృష్టికర్త..!
By: Tupaki Desk | 27 Dec 2021 9:26 AM GMTఅల్లు అర్జున్ - రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ''పుష్ప: ది రైజ్''. డిసెంబరు 17న తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. భారీ కలెక్షన్లతో దూసుకుపోన్న ఈ మూవీ.. తొలివారంలో వరల్డ్ వైడ్ గా రూ.229 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'పుష్ప' పార్ట్-1 చిత్రాన్ని వీక్షించారని.. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు సుకుమార్ ను అభినందించారని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
‘పుష్ప’ సినిమాలోని ప్రతి సీన్ ని ఇష్టపడ్డారని.. బాగా ఎంజాయ్ చేశానని తెలిపారు. ఈ సందర్భంగా సుకుమార్ ని చిరంజీవి కంగ్రాచ్యులేట్ చేస్తున్న ఫోటోలను మేకర్స్ షేర్ చేశారు. 'ఆచార్య'తో పుష్పరాజ్ సృష్టికర్త ఉన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లో 'పుష్ప' చిత్రాన్ని తెరకెక్కించారు. కూలీగా జీవితాన్ని ప్రారంభించిన ఓ యువకుడు.. స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేదే ఈ సినిమా కథాంశం. ఇందులో పుష్పరాజ్ అనే ఊర మాస్ పాత్రలో అల్లు అర్జున్ అదరగొట్టాడు. డిఫరెంట్ మేనరిజంతో చిత్తూరు యాసలో తగ్గేదే లే అంటూ ప్రేక్షకులను విశేషంగా అలరించారు.
బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఫహాద్ ఫాజిల్ - జగదీష్ - సునీల్ - అనసూయ - శత్రు - అజయ్ - అజయ్ ఘోష్ - ధనుంజయ ఇతర పాత్రల్లో ఆకట్టుకున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చగా.. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందించారు. రామకృష్ణ - మోనిక ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా.. కార్తీక శ్రీనివాస్ - రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేశారు.
ముత్తం శెట్టి మీడియా సహకారంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'పుష్ప' రెండో భాగం ''పుష్ప: ది రూల్'' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది వచ్చే ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్తుందని మేకర్స్ వెల్లడించారు.