Begin typing your search above and press return to search.
చిరు స్ఫూర్తితో ఆ అభిమాని ఎంత ఎదిగాడంటే..
By: Tupaki Desk | 10 Jun 2018 4:49 AM GMTకుర్రాళ్లకు సినిమా పిచ్చి పడితే చదువు అటకెక్కేస్తుందనే భయం తల్లిదండ్రుల్లో ఉంటుంది. సినిమాల వల్ల సమయం వృథా అయ్యి.. చదువు మీద.. కెరీర్ మీద ధ్యాస తగ్గిపోతుందనే అభిప్రాయం అందరిలోనూ ఉంటుంది. ఐతే సినిమాల ద్వారా స్ఫూర్తి పొంది.. పెద్ద స్థాయికి చేరిన వాళ్లు కూడా లేకుండా పోరు. ఆ కోవకే చెందుతాడంటూ ‘తేజ్ ఐ లవ్యూ’ ఆడియో వేడుకలో దర్శకులు హరీష్ శంకర్.. బి.వి.ఎస్.రవి ఒక వ్యక్తిని అందరికీ పరిచయం చేశారు. అతడి గురించి వాళ్లిద్దరూ చెప్పిన విషయాలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే.
హరీష్.. రవి పరిచయం చేసిన వ్యక్తి పేరు సతీష్. అతను మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అట. చిరంజీవి నటించిన 150 సినిమాల వివరాల్ని.. వాటి రిలీజ్ డేట్లను ఠకీమని చెప్పేస్తాడట. చిరంజీవి ఏ సినిమాను వదలకుండా ప్రతి సినిమానూ చాలాసార్లు చూశాడట. అలాగని అతనేమీ సినిమాల మాయలో పడి చదువును నిర్లక్ష్యం చేయలేదట. పదో తరగతిలో.. ఇంటర్లో అతను గోల్డ్ మెడలిస్టట. చదువు పూర్తయ్యాక మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి టీం లీడర్ కూడా అయ్యాడట. అమెరికా వెళ్లే అవకాశం వచ్చినప్పటికీ ఇక్కడే ఉండి మెగాస్టార్.. పవర్ స్టార్ సినిమాలు రిలీజైనపుడు అభిమానులతో కలిసి మార్నింగ్ షోలు చూడటంలో ఉన్న కిక్కు కోసం ఆగిపోయాడని హరీష్ వెల్లడించాడు. ‘గబ్బర్ సింగ్’ షూటింగ్ సందర్భంగా ఒక రోజు ఉదయం ఒక వ్యక్తి వచ్చి.. ఈ సినిమా హిట్టవుతుందా అంటూ దాదాపు ఏడుపు ముఖంతో అడిగాడని.. సాయంత్రం ప్యాకప్ చెప్పేవరకు అక్కడే ఉన్నాడని.. సాయంత్రం తాను అతడిని తిట్టానని.. ఇలా పనీపాటా లేకుండా ఉంటే పవన్ కు నచ్చదని చెబితే.. తాను మైక్రోసాఫ్ట్ లో మంచి పొజిషన్లో ఉన్నానని.. నెలకు మూడు లక్షల జీతం అని వెల్లడించాడని.. అతనే సతీష్ అని చెప్పుకొచ్చాడు హరీష్. ప్రస్తుతం అతను ఉద్యోగం చేసుకుంటూనే సాయిధరమ్ తేజ్ తో కలిసి తిరుగుతుంటాడని రవి వెల్లడించాడు.