Begin typing your search above and press return to search.
చిరు వాళ్లని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా?
By: Tupaki Desk | 3 Oct 2022 5:36 AM GMTమెగాస్టార్ చిరంజీవి నాలుగున్నర సంవత్సరాల సినీ చరిత్ర కలిగిన స్టార్. ఆయన చూసినన్ని సూపర్ హిట్స్ ఇండియాలో మరెవ్వరు చూసి ఉండరేమో అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి మెగాస్టార్ అద్భుతమైన నటనతో ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆరు పదుల వయసు దాటిన తర్వాత కూడా కుర్ర హీరో మాదిరిగా కష్టపడుతున్నారు.
వరుసగా సినిమాలు చేసేందుకు యంగ్ హీరోలు కష్టపడుతున్న ఈ సమయంలో ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్న ఘనత కేవలం చిరంజీవికి మాత్రమే దక్కింది. అంతటి ఘనత చాటుకున్న చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యల వల్ల విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఒక సినిమా ఫ్లాప్ అయిన సమయంలో హీరో అయినా ఇతర యూనిట్ సభ్యులు అయినా హుందాగా వ్యవహరించాలి.. మాట్లాడాలి.
ఆచార్య సినిమా ఫెయిల్యూర్ కి కారణం ఎవరైనా అయ్యి ఉండవచ్చు.. కానీ మెగాస్టార్ చిరంజీవి వంటి గొప్ప నటుడు ఫెయిల్యూర్ ను స్వీకరించి మౌనంగా ఉండి తదుపరి సినిమా తో హిట్ కొట్టి ఆ ఫెయిల్యూర్ కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇటీవల గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చిరంజీవి ఆచార్య ఫ్లాప్ కి దర్శకుడు కారణం అన్నట్లుగా ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేయడంను చాలా మంది తప్పుబడుతున్నారు.
సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఈ విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే ఇతర హీరోలు గతంలో మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో కొందరు యాంటీ మెగా ఫ్యాన్స్ షేర్ చేసి చిరంజీవిని ఇదే అదును అన్నట్లుగా విమర్శలు చేస్తూ ఉన్నారు.
గతంలో మహేష్ బాబు మాట్లాడుతూ సినిమా సక్సెస్ ఫ్లాప్ అనేది నా బాధ్యత.. నేను సినిమా కథను నమ్మి చేశాను.. కనుక అది నా వల్లే జరిగిందని నేను భావిస్తును. కనుక కథ విషయంలో సరైన జడ్జ్ మెంట్ తీసుకుని ఉంటే మంచి ఫలితం వచ్చేది అన్నట్లుగా మహేష్ బాబు మాట్లాడిన మాటలను ఇప్పుడు కొందరు షేర్ చేస్తున్నారు. అంతే కాకుండా ఆ మధ్య అక్షయ్ కుమార్ కూడా ఫెయిల్యూర్స్ కి పూర్తి బాధ్యత తనదే అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.
ఆ వీడియోలను ఇప్పడు సోషల్ మీడియాలో కొందరు షేర్ చేసి వీళ్లను చూసి మెగాస్టార్ చిరంజీవి ఫెయిల్యూర్స్ ను ఎలా తీసుకోవాలో నేర్చుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మెగా అభిమానులు వాళ్లను చూసి మెగా స్టార్ చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు అంటూ యాంటీ ఫ్యాన్స్ కి కౌంటర్ ఇస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.