Begin typing your search above and press return to search.

మేన‌ల్లుళ్ల‌ పై మెగా డేగ‌క‌న్ను

By:  Tupaki Desk   |   21 Jan 2019 8:56 AM GMT
మేన‌ల్లుళ్ల‌ పై మెగా డేగ‌క‌న్ను
X
మెగా వృక్షంలో ఇప్ప‌టికే 11 కొమ్మ‌లు ఉన్నాయి. అంత‌మంది హీరోల‌తో పాటు, ప్ర‌త్య‌క్ష ప‌రోక్షంగా మెగా కుటుంబం నుంచి సినీప‌రిశ్ర‌మ‌కు అంకిత‌మైన వాళ్లు ఎంద‌రో. చ‌ర‌ణ్ - శ్రీ‌మ‌తి సురేఖ‌ - సుశ్మిత (డిజైన‌ర్) - నాగ‌బాబు - అర‌వింద్ వంటి వాళ్లు నిర్మాత‌లుగా చెలామ‌ణి అవుతున్నారు. మెగా కాంపౌండ్ ప్రోత్సాహంతో ప‌లువురు అభిమానులు నిర్మాత‌లవుతున్నారు. ఇక ఈ ఫ్యామిలీ నుంచి ఎవ‌రైనా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నారంటే వాళ్ల‌కు మెగాస్టార్ మార్గ‌నిర్ధేశ‌నం త‌ప్ప‌నిస‌రి. హీరోలు అయినంత మాత్రాన తైత‌క్క‌లాడేందుకు మెగాస్టార్ ఇష్ట‌ప‌డ‌రు. ఎదిగినా ఒదిగి ఉండే గుణాన్ని అంద‌రికీ ముందే నూరి పోసారు. అందుకే చ‌ర‌ణ్‌ - బ‌న్ని - సాయిధ‌ర‌మ్‌ - శిరీష్‌ - వ‌రుణ్ తేజ్ - నిహారిక‌ - వైష్ణ‌వ్ తేజ్ (పరిచ‌యం) .. వీళ్లంతా ఎంతో ఒద్దిక‌గా ఉంటారు. ఒదిగి అంద‌రితో క‌లిసిపోతుంటారు. ఇక వీళ్ల కెరీర్ విష‌యంలోనూ మెగాస్టార్ డేగ క‌న్ను వేస్తారు. చూడ‌న‌ట్టే ఉన్నా.. స‌ర్వాంత‌ర్యామిలా అంతా చూస్తూనే ఉంటార‌ట‌.

మెగా వృక్షం హీరోలు - న‌టీన‌టుల విష‌యంలో వారు ఎంచుకునే క‌థ‌లు - ద‌ర్శ‌కులు - ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఇలా అన్నిటా మెగాస్టార్ ఇన్వాల్వ్‌మెంట్ త‌ప్ప‌నిస‌రి. ఒక‌సారి స‌ద‌రు హీరోలు లేదా వార‌సులు ఎవ‌రైనా ఫ‌లానా క‌థ ఉంది.. లేదా ఫ‌లానా ద‌ర్శ‌క‌నిర్మాత‌తో మూవ్ అవుతున్నాను అన‌గానే మెగాస్టార్ దానిని ప‌రిశీలిస్తారు. దానిపై పూర్తిగా త‌న అనుభవంతో రివ్యూ చెబుతారు.. విశ్లేషిస్తారు. ఇక మేన‌ల్లుళ్లు సాయిధ‌రమ్ - వైష్ణ‌వ్ తేజ్ విష‌యంలో మెగా డేగ క‌న్ను మ‌రింత ప‌క‌డ్భందీగా, క్లారిటీతో ప‌ని చేస్తోందిట‌. ఇటీవ‌ల సాయిధ‌ర‌మ్ కొన్ని త‌ప్ప‌ట‌డుగులు వేశాడు. అయితే త‌న‌కు ఎంపిక‌ల విష‌యంలో ఎంతో స్వేచ్ఛ‌నివ్వ‌డ‌మే అందుకు కార‌ణం. ఇక‌పై సాయిధ‌రమ్ కెరీర్ ని మెగాస్టార్ ప‌ర్టిక్యుల‌ర్ గా స్క్రుటినీ చేసి దారిలో పెడ‌తార‌ట‌. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ ఎంచుకున్న `చిత్ర‌ల‌హ‌రి` క‌థ‌ను మెగాస్టార్ పరిశీలించార‌ట‌. సాయిధ‌ర‌మ్ మైత్రి సంస్థ‌లో హిట్ కొడ‌తాడ‌న్న ధీమాని క‌న‌బ‌రుస్తోంది మెగా కాంపౌండ్.

నేడు ప్రారంభ‌మైన మేన‌ల్లుడు 2 వైష్ణ‌వ్ తేజ్ క‌థ‌ను ఫైన‌ల్ చేసింది మెగాస్టార్. వైష్ణ‌వ్ డెబ్యూపై మెగాస్టార్ ఎంతో సీరియ‌స్ గా క‌స‌ర‌త్తు చేశారు.. ఆయ‌న స‌జెషన్స్ తోనే క‌థ‌లో మెరుగులు దిద్దారట‌. ఇక చిరు గురించి సుకుమార్ చెబుతూ.. ఆయ‌న ఇప్పటికీ కాలేజ్ కుర్రాడిలా ఆలోచిస్తున్నార‌ని, క‌థ విష‌యంలో ఆలోచించే విధానం అలా ఉంద‌ని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆయ‌న నాలుగైదు సార్లు వైష్ణ‌వ్ క‌థ విన్నారు.. .. ఒక్కోసారి 4 గంట‌ల సేపు కూచుని క‌థ‌ విన్నార‌ని తెలిపారు. మెగాస్టార్ అంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగారో తెలుసా? ఇలాంటి క్వాలిటీస్ వ‌ల్ల‌నే అని అన్నారు సుక్కూ. ఇక మెగాస్టార్ ని ఇదివ‌ర‌కూ `రంగ‌స్థ‌లం` స‌మ‌యంలో ప‌లు వేదిక‌ల‌పైనా పొగ‌డ్త‌ల్లో ముంచెత్తిన సుకుమార్ .. వైష్ణ‌వ్ తేజ్ క‌థ‌ను ఫైన‌ల్ చేసింది మెగాస్టారేన‌ని ఘంటాప‌థంగా కుండ‌బ‌ద్ధ‌లు కొట్టి మ‌రీ చెప్పారు.