Begin typing your search above and press return to search.
హిట్లర్ రోజులు గుర్తొస్తున్నాయ్ చిరు!
By: Tupaki Desk | 14 Oct 2015 10:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి వీరాభిమానులకు 90ల్లో ఏం జరిగిందో ఏం జరిగిందో గుర్తుండే ఉంటుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి, ఘరానా మొగుడు, ముఠా మేస్త్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో దేశంలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు మెగాస్టార్. ఐతే ‘ముఠా మేస్త్రి’ తర్వాత చిరు కెరీర్ గాడి తప్పింది. వరుసగా ఒకటి కాదు.. రెండు కాదు.. ఆరు ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. ‘మెకానిక్ అల్లుడు’ దగ్గర్నుంచి ‘రిక్షావోడు’ వరకు చిరు ఫ్లాపుల పరంపర కొనసాగింది. దీంతో చిరు ముందడుగు వేయలేక డైలమాలో పడిపోయాడు. 1995లో ‘రిక్షావోడు రాగా.. తర్వాతి ఏడాది చిరు సినిమానే విడుదల కాలేదు.స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాక చిరు కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి స్లంప్ లేదు.
ఐతే ‘రిక్షావోడు’ వచ్చిన రెండేళ్లకు వచ్చింది హిట్లర్ సినిమా. అదే పేరుతో మలయాళంలో సూపర్ హిట్టయిన సినిమా ఇది. ముత్యాల సుబ్బయ్య డైరెక్టర్ చేసిన ఈ మూవీ చిరు కెరీర్ కు మళ్లీ ప్రాణం పోసింది. మెగా అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్పట్లో ‘రిక్షావోడు’ తర్వాత ఏం సినిమా చేయాలో తెలియక గ్యాప్ వచ్చింది మెగా స్టారుకి. ఇప్పుడు వేరే కారణాలతో గ్యాప్ తీసుకుని.. ఎనిమిదేళ్ల విరామం తర్వాత పునరాగమనానికి రెడీ అవుతున్నాడు. ఈసారి కూడా ఏ సినిమా చేయాలన్న విషయంలో చాలా డైలమా నడిచింది. చివరికి ఓ రీమేక్ మూవీకే ఓటేశాడు చిరు. తమిళ బ్లాక్ బస్టర్ ‘కత్తి’ రీమేక్ తో రాబోతున్నాడు. మరి అప్పట్లాగే సెంటిమెంటు వర్కవుటై చిరు హిట్టు కొడతాడేమో చూడాలి.