Begin typing your search above and press return to search.

తమిళనాడు సీఎంను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

By:  Tupaki Desk   |   1 Sept 2021 7:00 PM IST
తమిళనాడు సీఎంను కలిసిన మెగాస్టార్ చిరంజీవి
X
మెగాస్టార్ చిరంజీవి నేడు తమిళనాడు సీఎం స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. చెన్నై బయలుదేరి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి నేరుగా సీఎం స్టాలిన్ ఆఫీస్ కు చేరుకొని కలిశారు. ఆయనతోపాటు స్టాలిన్ తనయుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి.. స్టాలిన్ ఫ్యామిలీకి మొదటి నుంచి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సాన్నిహిత్యంతోనే తాజాగా చిరంజీవి సీఎంగా ఎన్నికైన స్టాలిన్ ను కలిసి సన్మానించారని తెలిసింది.

ఇక మరోవైపు చిరంజీవి తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం స్టాలిన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. స్టాలిన్ పాలన దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శమంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మాటలే కాదు.. చేతల్లోనూ పాలన ఎలా ఉండో చూపిస్తున్నారని మెచ్చుకున్నారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేశారు.

స్టాలిన్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాటి నుంచి తనదైన మార్క్ నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ ఆదర్శం అవుతున్నారు. ఎన్నికల్లో గెలిచి అతి తక్కువ సమయంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా అందరూ మాట్లాడుకునేలా అభివృద్ధి చేస్తున్నారు. అందుకే స్టాలిన్ ను అభినందించేందుకు మెగాస్టార్ చిరు స్వయంగా వెళ్లినట్లు తెలిసింది.