Begin typing your search above and press return to search.
అందుకే ఆయన మెగాస్టార్!
By: Tupaki Desk | 22 Aug 2022 9:30 AM GMTకృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనే మాట వినగానే సినిమా రంగానికి సంబంధించి గుర్తుకు వచ్చే పేరు చిరంజీవి. ఒక మనిషి ఎంతగా కష్టపడితే అంతగా ఎదగగలడు అని నిరూపించిన వారాయన. చిరంజీవి ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయానికి ఎన్టీఆర్ - ఏఎన్నార్ ఇద్దరూ కూడా మంచి జోరుమీద ఉన్నారు. ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల పరంపరను దాటుకుని సాంఘిక చిత్రాలలో తన హవాను కొనసాగిస్తున్నారు. ఏఎన్నార్ కూడా అదే స్థాయిలో చెలరేగిపోతున్నారు. ఆ తరువాత వరుసలో కృష్ణ - శోభన్ బాబు ఉన్నారు.
యాక్షన్ సినిమాలతో కృష్ణ దుమ్మురేపేస్తుంటే, రొమాంటిక్ హీరోగా శోభన్ బాబు ఇద్దరు హీరోయిన్లతో సందడి చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో హీరో పాత్రల దిశగా ట్రై చేయాలనే ఆలోచన రావడమే పెద్ద సాహసంగా భావించే రోజులవి. అలాంటి సమయంలో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి కెరియర్ తొలినాళ్లలో చేసిన సినిమాలు చూస్తే, ఆయన ఈ స్థాయిలో చరిత్రను తిరగరాస్తారని ఎవరూ కూడా అనుకోరు. తెలుగు తెరపై కొత్త కథలను పరిగెత్తిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. అంతగా తనని తాను మార్చుకుంటూ .. మలచుకుంటూ చిరంజీవి ఎదిగారు.
ఒక వైపున ఎన్టీఆర్ .. ఏఎన్నార్, మరో వైపున కృష్ణ .. శోభన్ బాబుల పోటీని తట్టుకుంటూ ముందుకు వెళుతున్న చిరంజీవికి, బలమైన సినిమా నేపథ్యం కలిగిన కుటుంబాల నుంచి వచ్చిన బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ లను నుంచి మరో సవాల్ ఎదురైంది. వారి ధాటిని కూడా తట్టుకుంటూ .. తాను సంపాదించుకున్న స్థానం నుంచి జారిపోకుండా పైకి ఎగబాకిన ధీశాలిగా చిరంజీవి కనిపిస్తారు. ఇక పక్కనే ఉన్న తమిళనాడు నుంచి అడపా దడపా రజనీకాంత్ .. కమల్ విసిరే విజయాలను కూడా తట్టుకునేలా ఆయన తన చుట్టూ ఒక కంచుకోటను నిర్మించుకున్నారు.
చిత్రపరిశ్రమలో ఇలా అంచలంచెల వారీగా సవాళ్లను స్వీకరించే పరిస్థితి ఒక్క చిరంజీవికి మాత్రమే ఎదురైందేమో. అప్పట్లో డాన్స్ లోను .. ఫైట్స్ లోను ఆయన పరిచయం చేసిన కొత్త పద్ధతులు చిరంజీవిని ఎదురులేని హీరోగా నిలబెట్టాయి. ఆయన స్టైల్ ఆయనకి రక్షణ కవచంగా నిలిచింది. నాలుగు దశాబ్దాలకి పైగా కొనసాగుతున్న ఈ ప్రయాణంలో అంతగా ఆడియన్స్ ను ప్రభావితం చేసిన హీరో లేడు .. ఆయనను దాటుకుని ముందుకు వెళ్లడం మరొకరికి సాధ్యం కాలేదు. ఇప్పటికీ కూడా ఆయన స్పీడ్ ను అందుకోవడానికి కుర్ర హీరోలు పరుగులు పెడుతున్నారు.
ఒక వైపున తన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన మిగతా సినిమాలను ప్రమోట్ చేయడానికి సమయాన్ని కేటాయిస్తుంటారు. తన ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ, ఇతర హీరోలను వేదికలపై ప్రశంసించడానికి వెనుకాడరు. ఎప్పటికప్పుడు కొత్తదనం ప్రయత్నించే హీరోల్లో ముందుంటూ వచ్చిన ఆయన, కొత్త తరాన్ని ప్రోత్సహించడానికి కూడా ముందుండటం విశేషం. ఎవరు ఏ ఉద్దేశంతో ఎలాంటి విమర్శలను చేసినా పట్టించుకోకుండా, తనవంతు సహాయ సహకారాలను అందిస్తూ ఆయన ముందుకు వెళుతున్నారు.
ఎన్నో కష్టాలు .. మరెన్నో అవమానాలను తట్టుకుంటూ, తనని తాను మలచుకున్న శిల్పం ఆయన. అభినయంతోను .. అంతకుమించిన మంచితనంతోను కోట్లాదిమంది మనసులను గెలుచుకున్న వారాయన. ఆకాశమంత ఎదిగినా ఆప్యాయంగా ఒదిగిపోయే అరుదైన లక్షణం ఆయన సొంతం. సముద్రమంత విస్తరించినా సెలయేరులా అందరి హృదయాలను తడుపుతూ వెళ్లే గొప్పగుణం .. తెలుగు ప్రేక్షకులకు దక్కిన గొప్పధనం. ఒదగడంలోనే ఎదగడం ఉందని చాటి చెప్పారు గనుకనే ఆయన మెగాస్టార్.