Begin typing your search above and press return to search.
మెగాస్టార్ నెక్ట్స్ కేజీఎఫ్ డైరెక్టరా? పూరీనా?
By: Tupaki Desk | 31 Dec 2022 11:30 PM GMTఒక సాధారణ ఆర్టిస్టును కూడా అసాధారణంగా తీర్చిదిద్దేవాడు సిసలైన దర్శకుడు. వెండితెరపై హీరోయిజాన్ని పరాకాష్టలో చూపించేవాడు డ్యాషింగ్ డైరెక్టర్ . ఈ రెండు క్వాలిటీస్ పుష్కలంగా ఉన్నా కానీ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుస వైఫల్యాల గురించి తెలిసినదే. మాస్ మసాలా కమర్షియల్ యాక్షన్ సినిమాల్ని తెరకెక్కించడంలో బలమైన సంభాషణలతో ఉద్రేకం రగిలించడంలో కసి ఉన్న డైరెక్టర్ గా అతడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కెరీర్ లో `ల్యాండ్ మార్క్` సినిమాలెన్నో తెరకెక్కించారు.
కానీ ఒక్కోసారి అతడి తడబాటు చూస్తుంటే ఈసారి అవకాశం ఇచ్చే హీరో ఎవరు? అన్న సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల దేవరకొండతో `లైగర్` పరాజయం అంతగా కలవరపాటుకు గురి చేసింది. పాన్ ఇండియా కేటగిరీలో భారీ హైప్ తో ఈ సినిమాని రిలీజ్ చేసి దర్శకనిర్మాతగా పూరి చేతులు కాల్చుకున్నారు. ఈ పరాజయం అతడి అవకాశాలకు గండి కొట్టింది. అయినా అతడు దేనినీ ఖాతరు చేయడు. తన ప్రయత్నాలను ఆపడు. స్టార్లతో తన సత్సంబంధాలను ఎలా ఎన్ క్యాస్ చేయాలో పక్కాగా తెలిసినవాడు పూరి. అందుకే అతడు మరో అవకాశాన్ని ఛేజిక్కించుకోగలడు.
అయితే పూరి నెక్ట్స్ టార్గెట్ ఎవరు? అంటే కచ్ఛితంగా అది మెగాస్టార్ చిరంజీవి అని ఫిలింనగర్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక భారీ డిజాస్టర్ ని చవి చూశాక అతడికి చిరు అవకాశమిస్తారా? అంటే ఏం జరుగుతుందో ముందే ఊహించలేం. పూరి వినిపించే కథ - కంటెంట్ దేనినైనా డిసైడ్ చేసేందుకు ఆస్కారం ఉంది. వరుస డిజాస్టర్లతో ఆల్మోస్ట్ కెరీర్ జీరో అయిపోయిన మెహర్ రమేష్ లాంటి దర్శకుడికి సైతం మెగాస్టార్ లిఫ్టిస్తున్నారు. ఇప్పుడు డిజాస్టర్ తో ఉన్న పూరీ వినిపించే స్క్రిప్ట్ కంటెంట్ ప్రతిదీ డిసైడ్ చేస్తుందనడంలో సందేహం లేదు.
అయితే మెగాస్టార్ ని ఈసారి రొటీన్ స్టోరీలతో ఒప్పించడం పూరీకి అంత సులువేమీ కాదు. అందుకే అతడు ప్రత్యేకించి ట్యాలెంటెడ్ రైటర్ల టీమ్ తో కలిసి కఠోరంగా శ్రమించి స్క్రిప్టును రెడీ చేస్తున్నాడని తెలిసింది. ఇది కచ్ఛితంగా చిరంజీవి కోసం రెడీ చేస్తున్న స్క్రిప్ట్. ఇంతకుముందే బాస్ కి లైన్ వినిపించి ఓకే చేయించుకున్నాడు. అయితే ఇప్పుడు చిరు మైండ్ లో ఏం ఉంది? వాల్తేరు వీరయ్య తర్వాత భోళా శంకర్ పూర్తి చేసి వెంటనే పూరీకి అవకాశమిస్తాడా? అంటే ఇప్పటికి ఇంకా క్లారిటీ లేదు.
బహుశా వాల్తేరు వీరయ్య ఫలితం చిరు ఆలోచనల్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఈ సినిమా విజయం సాధిస్తే కచ్ఛితంగా తాను నమ్మి అవకాశమిచ్చే దర్శకులు తనకు విజయాల్ని ఇస్తారనే ధీమా పెరుగుతుంది. ఒకవేళ తేడాలొస్తే గనుక అది పూరి పాలిట శాపంగా మారుతుందని విశ్లేషిస్తున్నారు. అయితే చిరును స్క్రిప్టుతో ఒప్పించే కాన్ఫిడెన్స్ తో పూరి ఉన్నాడు. ఇటీవల చిరంజీవితో జరిగిన పబ్లిక్ చిట్ చాట్ లో అన్నయ్య కోసం ఆటో జానీ కంటే మెరుగైన కథను తాను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ స్క్రిప్ట్ కూడా మాస్ ఆడియెన్ ని దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్నదే. దశాబ్ధాల కెరీర్ లో పూరి ఇప్పటివరకూ మెగాస్టార్ తో సినిమా చేయలేకపోయారు. అందుకే దానిని పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించి పని చేస్తున్నారని తెలిసింది.
`వాల్తేర్ వీరయ్య` రిలీజ్ అనంతరం చిరు పలువురు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య ఫలితం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఆసక్తికరంగా పూరీతో పాటు మెగాస్టార్ క్యూలో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. 2022లో కేజీఎఫ్ 2 తో బంపర్ హిట్ కొట్టి 1000 కోట్ల క్లబ్ డైరెక్టర్ గా సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ మెగాస్టార్ చిరంజీవి- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ తో ఓ భారీ మల్టీస్టారర్ ని తెరకెక్కిస్తారని ఇంతకుముందు గసగుసలు వినిపించాయి. అప్పట్లో ప్రశాంత్ నీల్ తో చిరు-చరణ్ భేటీ ఇలాంటి ఊహాగానాలకు తావిచ్చింది.
ఒకవేళ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ పూర్తి చేసి వెంటనే చిరు-చరణ్ లకు బౌండ్ స్క్రిప్ట్ వినిపిస్తే కథ వేరేగా ఉంటుందనడంలో సందేహం లేదు. జూ.ఎన్టీఆర్ తో సినిమా చేస్తూనే సైమల్టేనియస్ గా మెగా కాంపౌండ్ లోకి ప్రశాంత్ నీల్ అడుగుపెట్టే ఛాన్సుందని ఊహాగానాలు సాగుతున్నాయి. ఇక పూరీతో పాటు మారుతి సహా ఇతర యువదర్శకులు మెగాస్టార్ కోసం స్క్రిప్టులు రెడీ చేసి వేచి చూస్తున్నారు. అందువల్ల ఇతరుల కంటే మెరుగైన యూనివర్శల్ సబ్జెక్ట్ తో పూరి .. చిరును ఒప్పించాల్సి ఉంటుంది. పూరి రాసే కథలో బలం స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ సంభాషణల్లో పంచ్ ఇవన్నీ చిరుకు కనెక్టయితే ఛాన్స్ దక్కడం కష్టమేమీ కాదు. కానీ ఏం జరుగుతుందో వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.