Begin typing your search above and press return to search.
ఆ శుభవార్త వినగానే కన్నీళ్లొచ్చేశాయి!-చిరు
By: Tupaki Desk | 1 Jan 2023 11:15 AM GMTమెగాస్టార్ చిరంజీవి లెగసీని ముందుకు నడిపిస్తున్న రామ్ చరణ్ మునుముందు భారీ లక్ష్యాలతో కెరీర్ ని ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి నటవారసుడిగా ఇన్నేళ్లలో అతడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. ఎంతగా మెగాభిమానుల అండదండలున్నా తనను తాను నిరూపించుకునేందుకు తారా తీరంలో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు కఠోరంగా శ్రమించాడు.
ఇటీవలే అతడు తండ్రి కాబోతున్నాడన్న వార్త మెగాభిమానుల్లో కోలాహాలం నింపింది. రామ్ చరణ్- ఉపాసన జపాన్ టూర్ ముగించుకుని వచ్చి ఆ శుభవార్తను ప్పేందుకు జూబ్లీహిల్స్ లోని మెగాస్టార్ ఇంటికి వచ్చారట. ఈ విషయాన్ని చిరు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఆ మాట చెప్పగానే తనకు కన్నీళ్లు వచ్చేశాయని అన్నారు. ఆరేళ్ల పాటు ఈ శుభవార్త కోసమే ఎంతో ఆత్రంగా వేచి చూశామని అలాంటి శుభవార్త విన్నందుకు సంతోషంలో ఆనందభాష్పాలు వచ్చాయని తెలిపారు. నా కోడలు ఉపాసన తల్లి కాబోతోందన్న వార్తతో నేను - సురేఖ పట్టరాని సంతోషానికి గురయ్యాం. ఈ విషయాన్ని మూడో నెల తర్వాత అభిమానులకు వెల్లడించాం.. అని చిరు తెలిపారు.
నిజానికి మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించక ముందే ఉపాసన తన సామాజిక మాధ్యమాల్లో ఫ్రెగ్నెన్సీ శుభవార్తపై చిన్న పాటి హింట్ ఇచ్చారు. కానీ దానిని అభిమానులు అంతగా గమనించలేదు. ఎట్టకేలకు ఆ శుభవార్త మెగాస్టార్ నోటి వెంట వినడం అమితానందాన్ని కలిగించింది. చరణ్- ఉపాసన జంట పదో వివాహ వార్షికోత్సవం జరుపుకున్న వేళ ఈ శుభవార్తను అందించారు.
త్వరలోనే ఒక వారసుడు లేదా వారసురాలుని తమ ఇంటికి ఆహ్వానిస్తున్న ఈ శుభ సందర్భంలో రామ్ చరణ్ తన స్టార్ డమ్ ని అనంతంగా విస్తరించేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. నిజానికి చిరుతనయుడు రామ్ చరణ్ పెళ్లి జరిగే సమయానికి అసాధారణ స్టార్ డమ్ ని ఛేజిక్కించుకోలేదు. అప్పటికి మగధీర లాంటి బ్లాక్ బస్టర్ ఉన్నా తాను ఇంకా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందే వేరొక బంపర్ హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కొన్ని యావరేజ్ లతో కెరీర్ ని నెట్టుకొచ్చిన చాలా కాలానికి ధృవ- రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్లు అతడు ఆశించిన స్టార్ డమ్ ని అందించాయి.
అప్పటివరకూ అతడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. ఇటీవల రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తో చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. దీనిని మరో లెవల్ కి తీసుకెళ్లేందుకు రోబో శంకర్ తో భారీ చిత్రం చేస్తున్నాడు. తదుపరి కేజీఎఫ్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ తోను సినిమాని క్యూలో పెడుతున్నాడు. బిడ్డొచ్చే వేళ మెగా కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది. చరణ్ ఈ శుభతరుణంలో నెక్స్ట్ లెవల్ అంటే ఏంటో చూపించేందుకు తపిస్తున్నాడు.