Begin typing your search above and press return to search.

మంత్రిపై మెగాస్టార్ ప్రశంసలు

By:  Tupaki Desk   |   18 Jan 2023 5:40 AM GMT
మంత్రిపై మెగాస్టార్ ప్రశంసలు
X
మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ స్థాయి ఫార్ములా ఈ వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్ ను హైదరాబాద్‌ లో నిర్వహించబోతున్నందుకు మెగా స్టార్ చిరంజీవి మంత్రికి అభినందనలు తెలియజేశారు. అంతే కాకుండా చరిత్రలో నిలిచి పోయేలా ఈ అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ ను నిర్వహించాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు.

గ్రీన్ కో కంపెనీ ఆధ్వర్యంలో ఈ మెగా ఈవెంట్‌ ను నిర్వహించబోతున్నారు. అందుకు గాను గ్రీన్ కో కంపెనీ సీఈవో అనీల్ చలంశెట్టి ని కూడా చిరంజీవి కొనియాడారు. ఈ రేసింగ్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం పట్ల కూడా చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఈ రేసింగ్ కోసం టికెట్ల బుకింగ్‌ ప్రారంభం అయ్యింది. చిరంజీవి ట్వీట్‌ తో ఈ రేసింగ్ పై సాధారణ జనాల్లో కూడా ఆసక్తి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున రేసింగ్ ఈవెంట్ ను నిర్వహించడం..

ఆ ఈవెంట్‌ కు చిరంజీవి వంటి వారు మద్దతుగా నిలవడంతో ఆ ఈవెంట్ స్థాయి మరింతగా పెరిగినట్లు అయ్యిందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ ఏడాది భోళా శంకర్ సినిమాతో కూడా చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ మెగా కాంపౌండ్ నుండి ప్రచారం జరుగుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.