Begin typing your search above and press return to search.
మెగాస్టార్ స్లిమ్ లుక్ సీక్రెట్ ఇదేనట
By: Tupaki Desk | 22 July 2019 7:06 AM GMT60 ప్లస్ వయసులోనూ మెగాస్టార్ చిరంజీవి హార్డ్ వర్క్ అభిమానుల్లో హాట్ టాపిక్. ఈ ఏజ్ లోనూ బాక్సాఫీస్ వద్ద మెగా బాస్ బాక్సాఫీస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని `ఖైదీనంబర్ 150` నిరూపించింది. దాదాపు 150 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించాడు. అందుకే ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ `సైరా-నరసింహారెడ్డి` కోసం చిరు-చరణ్ బృందం ఎంతో రిస్క్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో `సైరా` చిత్రాన్ని ఏమాత్రం రాజీకి రాకుండా నిర్మిస్తున్నారు. ఇక రీఎంట్రీలో స్మార్ట్ అప్పియరెన్స్ కోసం మెగాస్టార్ శ్రమించిన తీరు అందరికీ షాకిచ్చింది.
ప్రస్తుతం చిరు వయసు 63. అయినా దేనినీ లెక్క చేయక ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర కోసం ఎంతో శ్రమించారని చిత్రయూనిట్ చెబుతోంది. బాస్ లోని గ్రేసు టైమింగ్ లో ఏమాత్రం సడలలేదని ఆన్ లొకేషన్ నుంచి రిపోర్ట్ కూడా అందింది. ఒక వీరయోధుడిగా తన రూపాన్ని ఎలివేట్ చేసేందుకు చిరు జిమ్ముల్లో చాలానే శ్రమించారు. సైరా చిత్రీకరణ పూర్తయింది. అక్టోబర్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఇకపోతే చిరంజీవి ప్రస్తుతం కెరీర్ 152వ సినిమా కోసం ప్రిపరేషన్స్ సాగుతున్నాయి.
చిరు 152వ చిత్రానికి ఇప్పటికే కొరటాల శివ ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసి.. సెట్స్ కెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమాలో బరువు బాగా తగ్గి.. బాస్ ఎంతో స్మార్ట్ లుక్ లో కనిపించాల్సి ఉందట. అందుకోసం ఇప్పటికే చిరంజీవి నేచురోపతి చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం వైజాగ్ లోని ఓ బీచ్ రిసార్ట్ కం స్పాలో ఆయన వెయిట్ రిడక్షన్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. స్పాలో మసాజ్ థెరపీతో రెజునవేషన్ ట్రీట్ మెంట్ సాగుతోందని తెలుస్తోంది. `ఖైదీనంబర్ 150` చిత్రంలో చిరు పాత రూపానికి మారి కనిపించారని అభిమానులు ప్రశంసించారు. ఈసారి అంతకుమించి స్మార్ట్ అప్పియరెన్స్ తో చిరుని చూడొచ్చట. ఇక ఇదే వైజాగ్ స్పాకి చిరు రెగ్యుల్ కస్టమర్. విక్టరీ వెంకటేష్ కి ఇది ఫేవరెట్ థెరపీ సెంటర్ అని చెబుతారు. చిరు.. వెంకీ ఇద్దరూ ఏమాత్రం తీరిక సమయం చిక్కినా అక్కడికి వెళ్లి వస్తుంటారు.