Begin typing your search above and press return to search.
అంబీతో మెగాస్టార్ బంధం
By: Tupaki Desk | 25 Nov 2018 6:38 AM GMTకన్నడ సినిమా రంగంతో పాటు యావత్ శాండల్ వుడ్ ప్రేక్షకులు విఖ్యాత నటులు అంబరీష్ మరణం పట్ల నిన్న రాత్రి నుంచే శోక సముద్రంలో మునిగిపోయారు. ఇంత హటాత్తుగా ఆయన కాలం చేయడాన్ని జీరించుకోలేక ప్రముఖ స్టార్లు సైతం శోకాన్ని కంట్రోల్ చేసుకోలేక కన్నీరు మున్నీరు అవుతున్నారు. రెండు వందల సినిమాలకు పైగా నటనానుభవం ఉన్న అంబరీష్ చివరి సినిమా ఇటీవలే విడుదలైంది. అంబీ నినిగె వయసాయితు దాని పేరు. అంటే పెద్దాయన నీకు వయసైపోయింది అని అర్థం. కిచ్చా సుదీప్ నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాదించింది.
అంబరీష్ ముద్దు పేరే అంబీ. ఈయనకు టాలీవుడ్ లో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో ఫ్యామిలీ ఫ్రెండ్ కన్నా ఎక్కువ బంధం ఈ ఇద్దరి మధ్య ఉండేది. అంబరీష్ భార్య సుమలత ఒకప్పుడు 80 దశకంలో తెలుగులో టాప్ హీరొయిన్లలో ఒకరు. చిరంజీవితో శుభలేఖ మొదలు ఖైది ఆపై వేట నుంచి పసివాడి ప్రాణం దాకా చాలా సినిమాలలో నటించారు.
చిరంజీవి బెంగుళూరు ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా అంబరీష్ ఇంటికి వెళ్ళకుండా తిరిగి రారు. ఆ మధ్య కన్నడ నటీనటుల సంఘానికి కొత్త బిల్డింగ్ నిర్మించినప్పుడు దాని ఓపెనింగ్ కి అంబరీష్ ప్రత్యేకంగా చిరంజీవిని ముఖ్య అతిధిగా పిలిచారు. వాటి తాలుకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. అంబరీష్-చిరు ఇద్దరు కలిసి నటించిన చిత్రం శ్రీ మంజునాథ. అందులో సుమలత కూడా ఉన్నారు.
అంబరీష్ దంపతులు హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా చిరు ఆతిధ్యం తప్పనిసరి. ఇంత ఘాడమైన బంధం ఉన్న మిత్రుడి మరణం చిరుకి షాక్ కలిగించింది. ఆయన హుటాహుటిన చివరి సందర్శన కోసం బెంగుళూరు బయలుదేరినట్టు సమాచారం. సూపర్ స్టార్ రజనికాంత్ ఇవాళ తెల్లవారుఝామునే బెంగుళూరు చేరుకుని కాసేపటి క్రితమే పార్ధీవ దేహాన్ని సందర్శించి సుమలతను ఓదార్చారు. రెబెల్ స్టార్ అని మనకు కృష్ణం రాజు గారికి పేరుంటే అక్కడ అంబరీష్ ని అభిమానులు రెబెల్ స్టార్ అని పిలుస్తుంటారు.