Begin typing your search above and press return to search.

ఇలా అన్నీ లీకులిచ్చేస్తే ఎలా వేగేది బాసూ?

By:  Tupaki Desk   |   15 April 2020 5:14 AM GMT
ఇలా అన్నీ లీకులిచ్చేస్తే ఎలా వేగేది బాసూ?
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న CHIRU 152 గురించిన ర‌క‌ర‌కాల లీకులు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో జోరుగా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ .. క‌థాంశం.. పాత్ర‌ధారుల గురించి చాలానే లీకులందాయి. ప్ర‌తిదీ ఎగ్జ‌యిట్ మెంట్ పెంచేవే. అయితే ప్ర‌తిదీ ఇలా ముందే తెలిసిపోతే ఎలా? స‌స్పెన్స్ అన్న‌దే లేకుంటే జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తారా?

అయితే అలాంటి భ‌యం ఏదీ లేకుండా ఇంత‌కుముందు పొర‌పాటునో లేక టంగ్ స్లిప్ప‌యిపోవ‌డం వ‌ల్ల‌నో మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా సినిమా టైటిల్ ని రివీల్ చేసేశారు. ఆచార్య అన్న టైటిల్ ఆయ‌న నోట విన్న‌ప్ప‌టి నుంచి దానికి అభిమానులు ఫిక్స‌యిపోయారు. తాజాగా చిరు మ‌రో ఇంట్రెస్టింగ్ లీకును తెలిసో తెలియ‌కో అందించేయ‌డంతో ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌ల క‌రోనా క‌ల్లోలం వేళ చిరుకి కావాల్సినంత తీరిక స‌మ‌యం చిక్కింది. ఆయ‌న ఇంట్లోనే స్వీయ నిర్భంధంలో ఉంటూనే జ‌ర్న‌లిస్టుల‌కు ఫోన్ ఇంట‌ర్వ్యూలు ఇస్తుండ‌డంతో ర‌క‌ర‌కాల సంగ‌తులు బ‌యటికి లీకైపోతున్నాయి. ఈ లీకుల్లో ఆయ‌న ఆచార్య క‌థేంటో చెప్పేయ‌డంతో అస‌లు స‌స్పెన్స్ అన్న‌దే లేకుండా పోయింద‌ని అభిమానులు ఒక‌టే కంగారు ప‌డిపోతున్నారు.

అస‌లింత‌కీ ఆచార్య క‌థేమిటి? అంటే.. ఇన్నాళ్లు దేవాదాయ శాఖ‌లో జ‌రిగే అవినీతిపై పోరాడే న‌క్స‌లైట్ క‌థాంశం ఇద‌ని ప్ర‌చార‌మైంది. ఇందులో చిరు ఎండోమెంట్ అధికారిగా క‌నిపిస్తాడ‌ని డ్యూయ‌ల్ షేడ్ ఉంటుంద‌ని కూడా హీటెక్కించేశారు. తాజాగా చిరు చెబుతున్న దానిని బ‌ట్టి కేవ‌లం దేవాదాయ శాఖ అవినీతికే ప‌రిమితం కాదు.. ఇందులో ఇత‌ర లింకులు ఉన్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. ఇది అట‌వీ శాఖ అవినీతిపై కూపీ లాగే క‌థాంశం కూడా. అట‌వీ నిధిని కొల్ల‌గొడుతూ ప్ర‌కృతిని విధ్వంశం చేసే షాడో నాయ‌కుల లేదా మాఫియా అంతు చూసే అధికారిగా చిరు క‌నిపించ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. అలాగే ఇందులో చిరంజీవి నేచుర‌ల్ రీసోర్సెస్ పై ప‌రిశోధించే ప్రొఫెస‌ర్ గా .. న‌క్స‌లైట్ గా డ్యూయ‌ల్ షేడ్ తో క‌నిపిస్తార‌ని తెలుస్తోంది.

``జ‌న‌తా గ్యారేజ్ లో ఎన్టీఆర్ నేచుర్ ల‌వ‌ర్ గా ... ప్ర‌కృతిని కాపాడే వాడిగా క‌నిపించాడు. ఆచార్య‌లో నేచుర్ రీసోర్సెస్ (ప్ర‌కృతి వ‌న‌రులు) ని కాపాడే ప్రొఫెస‌ర్ గా క‌నిపిస్తాన‌ని చిరు లీక్ చేసేశారు. సోషియో పొలిటిక‌ల్ డ్రామా.. పైగా ప్ర‌కృతి విష‌యంలో సందేశం మేళ‌వించి కొర‌టాల ఈ క‌థ‌ను రాసుకున్నార‌ని చిరు చెప్పిన దానిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొర‌టాల గ‌త చిత్రాల త‌ర‌హాలోనే ఎమోష‌న్ ప్ర‌ధాన ఆయుధంగా ఉండ‌నుంది.