Begin typing your search above and press return to search.

ఉయ్యాలవాడలో మెగాస్టార్.. ఉన్నట్లేనా?

By:  Tupaki Desk   |   17 Aug 2017 6:28 AM
ఉయ్యాలవాడలో మెగాస్టార్.. ఉన్నట్లేనా?
X
దాదాపు పదేళ్ల రాజకీయాల తర్వాత సినితెరపై తన 150వ సినిమాతో అభిమానులను అలరించిన మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాపై ప్రస్తుతం విహారి అంచనాలు ఉన్నాయి. ఖైదీ నెంబర్ 150 తో బాస్ ఇస్ బ్యాక్ అని చెప్పిన మెగాస్టార్ ఇప్పుడు తనదైన శైలిలో ఉయ్యాలవాడ నరిసింహ రెడ్డి చరిత్రతో రాబోతున్నాడు. అయితే రీసెంట్ గా ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి శ్రేయోభిలాషి నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఆయన ఎవరో కాదు బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్. అయితే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలను బుదవారం స్టార్ట్ చేశారు. ఇప్పటికే పూర్తిగా కథ సిద్ధం అవ్వడంతో త్వరలోనే షూటింగ్ ని స్టార్ట్ చేసి. ఈ నెల 22న మెగాస్టార్ జన్మదిన సందర్బంగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారట. అయితే ఇందులో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారా లేదా అనేది ఇంకా అధికారికంగా వెలువడలేదు. కానీ అందులో ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఓ అగ్ర నటుడు కావాలని అనుకుంటున్నారట. పైగా హిందీలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సిద్దమవుతుండడంతో అమితాబ్ ఉంటారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

అలాగే తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో ఉన్నాడనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఇక కన్నడలో కూడా ఈ చిత్రం రిలీజ్ చేస్తుండడంతో హీరో సుదీప్ ని ప్రతినాయకుడిగా చూపేందుకు సిద్ధమయ్యారని కూడా రూమర్స్ వెలువడుతున్నాయి. కాని ఇవన్నీ నిజంగా కాదంటున్నారు. ఇక ఈ చిత్రానికి ఏఆర్. రెహమాన్ సంగీత దర్శకుడిగా సెలక్ట్ చేయనున్నారట. ఒకవేళ రెహ్మాన్ ఒప్పుకోకపోతే మాత్రం కీరవాణి లేదంటే చిరంతన్ భట్ ఈ సినిమాను చేస్తారట. ఇక చిరు సరసన మహారాణిగా నయనతార నటించనుంది. తెల్ల దొరలను గడగడలాడించిన కర్నూలు వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్ర ఎలా ఉండబోతుందో అని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు.