Begin typing your search above and press return to search.

వాల్తేర్ వీర‌న్న వ‌ర్సెస్ వాల్తేర్ శీను.. ఏది బెస్ట్?

By:  Tupaki Desk   |   26 Aug 2021 8:30 AM GMT
వాల్తేర్ వీర‌న్న వ‌ర్సెస్ వాల్తేర్ శీను.. ఏది బెస్ట్?
X
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు వేడుక‌ల్లో వ‌రుస‌గా తాను న‌టించే సినిమాల టైటిల్స్ ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో లూసీఫ‌ర్ రీమేక్ టైటిల్ `గాడ్ ఫాద‌ర్` ని అధికారికంగా చేయ‌గా.. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న వేదాళం రీమేక్ టైటిల్ గా `భోళా శంక‌ర్`ని ప్ర‌క‌టించారు. భోళా శంక‌ర్ టైటిల్ కి త‌గ్గ‌ట్టే మెగాస్టార్ నుంచి గొప్ప వినోదాన్ని ఆశించేందుకు ఆస్కారం ఉంది.

మెహ‌ర్ కంటే ముందే బాబీతో సినిమా చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లాల్సి ఉంటుంద‌ని స‌మాచారం. కానీ ద‌ర్శ‌కుడు బాబి తెర‌కెక్కించే సినిమాకి టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు ఎందుక‌నో. మెగా బాస్ ని పూర్తి మాస్ రోల్ లో చూపించేందుకు బాబి సిద్ధ‌మ‌వుతున్నారు. పోస్ట‌ర్ ని బ‌ట్టి అత‌డు వైజాగ్ లోని మ‌త్స్య‌కారుల నేప‌థ్యంలో మాస్ స్టోరీని ఎంపిక చేసుకున్నార‌ని ఊహాగానాలు సాగిస్తున్నారు. వాల్తేర్ కి చెందిన వీర‌న్న క‌థ‌ను బాబి రాసారు. అయితే ఇప్పుడు వీర‌న్న టైటిల్ మారుతుంద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. వాల్తేర్ వీర‌న్న కాస్తా వాల్తేర్ శీనుగా మార్చార‌ని క‌థ‌నొలొస్తున్నాయి.

అయితే ఆ రెండు టైటిల్స్ లో ఏది బెస్ట్? అన్న‌ది మెగాభిమానులు ఎవ‌రికి వారు గెస్ చేస్తున్నారు. ఇందులో వీర‌న్న అనేది ఊర మాస్ అప్పీల్ ఉన్న టైటిల్. శీను అనేది కొత్త‌గా ఏం లేదు. శీను ప‌దే ప‌దే ఉప‌యోగించేసిన బోరింగ్ టైటిల్. పైగా అది ఊర మాస్ కాదు. కానీ మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీర‌న్న‌కు బ‌దులుగా వాల్తేర్ శీనుకే ప్రాధాన్య‌త‌నిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి అంతిమంగా ఏ టైటిల్ ని ప్ర‌క‌టిస్తారు? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంది.

చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రీకరణ పూర్తి కాగానే బాబీతో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మాస్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తుంది. ఇప్ప‌టికే బాస్ లుక్ మెగాభిమానుల్లో వైర‌ల్ అయ్యింది. చిరు న‌టిస్తున్న గాడ్ ఫాద‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు నాలుగు రోజుల పాటు బ్రేక్ ప‌డింద‌ని ఇంత‌కుముందే స‌మాచారం అందింది. ఛాయాగ్రాహ‌కుడు నీర‌వ్ షా అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల్ల ఈ వాయిదా అని తెలిసింది. అత‌డు అజిత్ వాలిమై చిత్రీక‌ర‌ణ కోసం విదేశాల‌కు వెళ్లారు. నాలుగు రోజుల అనంత‌రం తిరిగి గాడ్ ఫాద‌ర్ టీమ్ తో చేర‌తారు.