Begin typing your search above and press return to search.
హాట్ కామెంట్ : ఆచార్య ట్రైలర్ బోయపాటి కట్ చేశాడా?
By: Tupaki Desk | 13 April 2022 11:30 AM GMTమెగాస్టార్ అభిమానులు దాదాపు రెండున్నరేళ్లుగా మెగాస్టార్ నటిసస్తున్న `ఆచార్య` కోసం ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈమూవీ ఎట్టకేలకు ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. కొరటాల నుంచి కూడా సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్లవుతోంది. దీంతో ఆచర్య కోసం మెగా అభిమానులతో పాటు కొరటాల శివ అభిమానులు ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. టీజర్ తో హీటెక్కించిన కొరటాల ట్రైలర్ ని ఏ రేంజ్ లో కట్ చేస్తాడో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.
గత కొన్ని రోజులుగా ఊరించిన `ఆచార్య` ట్రైలర్ మొత్తానికి మంగళవారం రానే వచ్చింది. ఇందులో రెండు విషయాలు ప్రధానంగా అభిమానులతో పాటు సినీ లవర్స్ ని విస్మయానికి గురిచేశాయి. ఆచార్య ...ఏంటీ ఈ కన్ఫ్యూజన్? అనే స్థాయిలో ఇప్పడు కామెంట్ లు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ ఆచార్య నుంచి ఎలాంటి అంశాలని అయితే కోరుకుంటున్నారో అదే తరహా ఎమోషన్, యాక్షన్ అంశాలతో ట్రైలర్ ని కట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ కి ఈ మూవీ మాస్ జాతరే అనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
కానీ ట్రైలర్ ని మొత్తం బొయపాటి శ్రీను సినిమాలా హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల సమామారంగా చూపించడంతో ఈ ట్రైలర్ ని కొరటాల కట్ చేశారా? లేక పొరపాటున బోయపాటి శ్రీను హ్యాండ్ వేశారా? అనే కామెంట్ లు ప్రస్తుతం ఈ ట్రైలర్ పై వినిపిస్తున్నాయి. పైగా ట్రైలర్ లో కొరటాల శివ మార్కు మాత్రం ఎక్కడా కనిపించడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది.
ఇక పాదఘట్టంని కాపాడే చిరుతలుగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కనిపించబోతున్నట్టుగా చూపించారు. ఓ దశలో చరణ్ పాత్రని ఎండ్ చేస్తారని ఇప్పటికే ఓ వార్త బయటికి వచ్చేసింది. ఇందులో చరణ్ పాత్ర నిడివి 25 నిమిషాలేనట. అయితే ఆ పాత్ర పాదఘట్టం తో పాటు ధర్మస్థలిని పరిచయం చేస్తూ ట్రైలర్ ని కట్ చేసిన తీరే మరో అనుమానాన్ని రేకెత్తిస్తోంది.
ఇంతకీ `ఆచార్య`లో అతిథి పాత్ర చరణ్ దా? .. లేక మెగాస్టార్ దా? అనే అనుమానాలు మొదలవుతున్నాయి. ట్రైలర్ లో చరణ్ పాత్ర పరిచయం .. ఆ తరువాతే చిరు ఎంట్రీ కనిపించిన తీరు.. అడివిలో నక్సలైట్ లుగా కనిపించిన సందర్భంలోనూ ఓ ఫైట్ లో చిరు చేయి పై కాలు పెట్టి గాల్లో ఎగిరిన చరణ్ ఓ వ్యక్తిని చంపుతున్న తీరు ప్రేక్షకుల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. చరణ్ ప్రారంభించిన పనిని చిరు పూర్తి చేసి అతని ఆశయాన్ని నెరవేర్చడానికి వచ్చినట్టుగా ట్రైలర్ లో స్పష్టమవుతోంది. దీన్ని బట్టి చరణ్ సినిమాలో చిరు గెస్ట్ రోల్ అన్నట్టుగా వుందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
ఇక ట్రైలర్ లో అత్యధిక భాగం యాక్షన్ ఘట్టాలనే చూపించారు. ఇప్పుడున్న ట్రెండ్ ని ఫాలో అవుతూ ఈ ట్రైలర్ ని యాక్షన్ పార్ట్ తో కట్ చేశారా? లేక మరేదైనా వుద్దేశ్యం వుందా? అన్నది తెలియాల్సి వుంది. ట్రైలర్ చూసిన మరో వర్గం మాత్రం ఆచార్య ఏంటీ ఈ కన్ఫ్యూజన్ ఇంతకీ సినిమా బిగ్ బాస్ దా? లేక చిన్న బాస్ దా అని ఓపెన్ గానే సోషల్ మీడియా వేదికగా అడిగేస్తున్నారు. ఈ ట్రైలర్ కట్ వెనకున్న అసలు కథేంటో కొరటాల రివీల్ చేస్తాడేమో చూడాలి. ఇక ఈ ట్రైలర్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డేకే ప్రాధాన్యత దక్కింది కానీ కాజల్ ని మాత్రం పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆమె ఫ్యాన్స్ గుర్రుగా వున్నారట.