Begin typing your search above and press return to search.
మెగాస్టార్ డజను సినిమాలు మళ్లీ వచ్చాయి
By: Tupaki Desk | 27 May 2021 12:30 AM GMTఒకరు రిజిస్టర్ చేసిన సినిమా టైటిల్ ను మరొకరు వినియోగించకూడదు. కాని కొన్ని సంవత్సరాల తర్వాత ఆ టైటిల్ ను మళ్లీ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. టైమ్ లిమిట్ అయిన సినిమా టైటిల్ ను ఎలాంటి అనుమతులు లేకుండా వినియోగించుకోవచ్చు. టైమ్ లిమిట్ అవ్వని పాత టైటిల్స్ ను మాత్రం పర్మీషన్ తీసుకుని పెట్టుకోవచ్చు. ఈమద్య కాలంలో చాలా సినిమాలకు పాత సినిమాల పేర్లు పెడుతున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా ఫిల్మ్ మేకర్స్ పాత టైటిల్స్ వెంట పడుతున్నారు. చిరంజీవి నటించిన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను సినిమాల టైటిల్స్ మళ్లీ వచ్చాయి.
చిరంజీవి సూపర్ హిట్ మూవీ విజేత టైటిల్ ను ఆయన అల్లుడు కళ్యాణ్ దేవ్ తన మొదటి సినిమాకు ఉపయోగించుకున్నాడు. యముడికి మొగుడు టైటిల్ తో అల్లరి నరేష్ హీరోగా ఒక సినిమాను చేశాడు. మోహన్ బాబుతో చిరంజీవి నటించిన బిల్లా రంగా టైటిల్ తో ఒక సినిమా వచ్చింది. గూడచారి నెం.1 టైటిల్ తో చాలా ఏళ్ల క్రితమే అర్జున్ హీరోగా సిమ్రాన్ హీరోయిన్ గా సినిమా వచ్చింది. ప్రాణం ఖరీదు సినిమా టైటిల్ ను ఇటీవల ఒక సినిమాకు వినియోగించారు. ఇక చిరు సూపర్ డూపర్ హిట్ మూవీ పున్నమి నాగు టైటిల్ తో ముమైత్ ఖాన్ ఒక సినిమా ను చేసింది.
సూపర్ హిట్ మూవీ 'రాక్షసుడు' టైటిల్ ను బెల్లంకొండ హీరోగా నటించిన ఒక రీమేక్ కు వినియోగించారు. చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ చిత్రాల్లో ఒక్కటైన గ్యాంగ్ లీడర్ టైటిల్ తో నాని వచ్చాడు. ఇక ట్రెండ్ సెట్టర్ మూవీ చిరు ఖైదీ టైటిల్ ను కార్తీ కోసం లోకేష్ కనగరాజ్ ఉపయోగించాడు. చిరు దొంగ టైటిల్ ను కూడా కార్తీ నే మళ్లీ వినియోగించాడు. ఇక మాస్టర్ టైటిల్ తో తమిళంలో విజయ్ ఒక సినిమాను చేశాడు అది తెలుగులో కూడా మాస్టర్ గానే వచ్చింది. ముగ్గురు మొనగాళ్లు సినిమా టైటిల్ ను కూడా ఇటీవల ఒక కొత్త సినిమా కోసం రీ యూజ్ చేశారు. మొత్తంగా చిరంజీవి 12 సినిమాల టైటిల్ ల్లు మళ్లీ వచ్చాయి.