Begin typing your search above and press return to search.

'కళాతపస్వి' పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్..!

By:  Tupaki Desk   |   19 Feb 2021 1:00 PM GMT
కళాతపస్వి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్..!
X
సీనియర్ దర్శకుడు 'కళాతపస్వి' కె.విశ్వనాథ్ - మెగాస్టార్ చిరంజీవి మధ్య గురుశిష్యుల అనుబంధం ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో నిలిచిపోయే దర్శకులలో ఒకరైన కె.విశ్వనాథ్.. చిరంజీవితో 'శుభలేఖ' 'ఆపద్భాంధవుడు' 'స్వయంకృషి' వంటి క్లాసిక్స్ తీసాడు. అందరు డైరెక్టర్స్ యాక్షన్ సినిమాలు తీసి చిరుని మాస్‌ ఆడియన్స్ కి దగ్గర చేస్తే.. క్లాస్ సినిమాలు తీసిన విశ్వనాథ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసాడు. నేడు శుక్రవారం కె.విశ్వనాథ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసారు.

''గురుతుల్యులు, పితృసమానులు, మహోన్నత దర్శకులు, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన కళాతపస్వి శ్రీ కే విశ్వనాథ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన తీసిన ప్రతీ చిత్రం ఓ ఆణిముత్యం. తెలుగు వారికి చిరస్మరణీయం. ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను'' అంటూ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా విశ్వనాథ్ తో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేసాడు చిరు. ఇందులో మోకాళ్ళపై కూర్చొని ఉన్న చిరంజీవిని కుర్చీలో కూర్చొని ఉన్న విశ్వనాథ్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇకపోతే దీపావళి సందర్భంగా చిరంజీవి సతీసమేతంగా విశ్వనాథ్ ని కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్న సంగతి తెలిసిందే.