Begin typing your search above and press return to search.
ఆ రీమేక్ తమ్ముడి కోసం కాదన్న అన్నయ్య
By: Tupaki Desk | 6 April 2020 11:30 PM GMTమలయాళ బ్లాక్ బస్టర్ లూసీఫర్ ని తెలుగులో కొణిదెల కాంపౌండ్ రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని .. అయితే ఈ రీమేక్ ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో చేయాలని చరణ్ భావించారని పొంతన లేకుండా రకరకాలుగా ప్రచారమైంది. అసలు లూసీఫర్ రీమేక్ హక్కులు కొన్నది పవన్ కోసమేనని కాస్త అడ్వాన్స్ డ్ గానే ప్రచారం సాగిపోయింది.
అయితే ఆ ప్రచారంలో నిజం లేదని మెగాస్టార్ చిరంజీవి తాజా ఇంటరాక్షన్ లో కొట్టి పారేశారు. లూసీఫర్ హక్కులు కొనుక్కున్నది తాను నటించేందుకు మాత్రమేనని చిరు తెలిపారు. ఒకవేళ పవన్ ఆసక్తి చూపిస్తే తనకు ఇచ్చేందుకు అభ్యంతరమేమీ లేదని ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే ఆ మూవీలో నటించేందుకు తాను అమితాసక్తితో ఉన్నానని మెగాస్టార్ క్లారిటీ ఇచ్చేసినట్టే. ఇప్పటికే పలువురు దర్శకులు లూసీఫర్ తెలుగు స్క్రిప్టుపై పని చేస్తున్నారని వార్తలొచ్చాయి. సుకుమార్ .. బాబి సహా పలువురి పేర్లు ఇదివరకూ తెరపైకొచ్చాయి. అయితే వీళ్లలో ఎవరి స్క్రిప్టు బావుంటే ఫైనల్ గా వారికే ఛాన్సుంటుందన్నమాట.
ప్రస్తుతం కరోనా క్రైసిస్ వల్ల షూటింగులు బంద్ అయిన సంగతి తెలిసిందే. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే ఏప్రిల్ 15న లాక్ డౌన్ ఎత్తేస్తారా లేదా? అన్న టెన్షన్ అలుముకుంది. ఈ నేపథ్యంలో లూసీఫర్ రీమేక్ స్క్రిప్టును మలిచేందుకు చాలా సమయం మిగిలి ఉంటుంది. మరి రేస్ లో ఉన్న దర్శకుల్లో ఎవరు ముందుగా చిరుని కన్విన్స్ చేస్తారు? అన్నది చూడాలి. కొరటాలతో సినిమా పూర్తయితే బహుశా ఈ స్క్రిప్టుపైనే చిరు వర్క్ చేస్తారని అర్థమవుతోంది. అంటే చిరు 153 కచ్ఛితంగా రీమేక్ అవుతుందా లేదా? అన్నది రీమేక్ స్క్రిప్టు రాస్తున్న దర్శకుల ట్యాలెంట్ పైనే ఆధారపడి ఉందన్నమాట.