Begin typing your search above and press return to search.
చెర్రీ ఇచ్చిన మాటను తీర్చిన మెగాస్టార్... ?
By: Tupaki Desk | 12 Nov 2021 12:30 PM GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సూపర్ స్టార్ డమ్ తో దూసుకుపోతున్నాడు. వరసబెట్టి సినిమాలకు కమిట్ అవుతూ క్రేజీ కాంబోలను తెర మీదకు తెస్తున్నాడు. చెర్రీ డేట్స్ మరో రెండేళ్ల దాకా అసలు ఖాళీ లేవు అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే తండ్రి చిరంజీవి సినిమాలు అంటే చెర్రీకి విపరీతమైన ఇష్టం. అంతే కాదు, ఆనాడు తన తండ్రితో చేసిన బ్యానర్లతో, వీలైతే దర్శకులతో కలసి చేయాలన్న ఆశ అయితే చెర్రీకి ఎక్కువగా ఉంది. ఆ మధ్య చెర్రీ ఇలాగే తన మనసులోని మాటను తండ్రి చిరంజీవితో పంచుకున్నాడుట. అదేంటి అంటే మెగాస్టార్ తో వరసబెట్టి సూపర్ హిట్స్ తీసిన క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద సినిమా చేయాలని చెర్రీకి ఆశట. ట్రిపుల్ ఆర్ పూర్తి కాగానే కేఎస్ రామారావు బ్యానర్ మీద సినిమా చేస్తాను అని చెర్రీ చెప్పారట కూడా.
అయితే అది వీలు పడలేఎదు. ఎందుకంటే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దిల్ రాజు మూవీకి కమిట్ అయిపోయాడు. ఆ తరువాత కూడా క్యూ లైన్ లో సినిమాలు ఉన్నాయి. దాంతో కొడుకు ఇచ్చిన మాటను తండ్రి చిరంజీవి నెరవేరుస్తున్నాడు. లేటెస్ట్ గా ముహూర్తం జరుపుకున్న భోలా శంకర్ మూవీ నిర్మాణంలో క్రియేటివ్ కమర్షియల్స్ కూడా ఒక భాగస్వామిగా ఉండడం విశేషం. అలా దాదాపుగా ముప్పయ్యేళ్ల తరువాత ఆ బ్యానర్ లో మెగాస్టార్ చేయడమూ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం.
క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో ఫస్ట్ మూవీగా చిరంజీవి అభిలాష వచ్చింది. ఆ వెంటనే చాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇక చివరిగా వచ్చిన మూవీ స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్. ఇది 90 దశకంలో వచ్చింది మొత్తానికి చెర్రీ క్రియేటీవ్ కమర్షియల్స్ బ్యానర్ లో ఎపుడు నటిస్తాడో తెలియదు కానీ మెగాస్టారే మళ్లీ కేఎస్ రామారావు హీరో అయిపోయాడు. ఇక్కడ మరో ముచ్చట కూడా చెప్పుకోవాలి. చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ని ఇచ్చింది కూడా కేఎస్ రామారావే. సో ఈ కాంబోలో వస్తున్న భోళా శంకర్ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటున్నారు.