Begin typing your search above and press return to search.
రోజాకు మెగాస్టార్ భలే పంచ్ వేశారే!
By: Tupaki Desk | 11 Jan 2023 10:41 AM GMTమెగాస్టార్ చిరంజీవి తనని ఎవరు టార్గెట్ చేసినా.. కావాలని తనపై ఘాటు విమర్శలు చేసినా పెద్దగా స్పందించరు.. అగ్రెసీవ్ గా కౌంటర్ లు ఇచ్చిన సందర్భాలు లేవు. అదేమని అడిగితే అది తన స్వభావం కాదని, ప్రతీ విషయంలోనూ తాను పాజిటివ్ దృక్పథంతోనే వుంటానని చెబుతూ వస్తున్నారు. ఆ మధ్య బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలోనూ తనపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై కూడా చిరు కామెంట్ లు చేయకపోవడం తెలిసిందే.
ఇదిలా వుంటే నటి, ఏపీ మంత్రి రోజా ఇటీవల మోగా బ్రదర్స్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తనదైన స్టైల్లో పంచ్ వేయడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మాసీవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య'. బాబి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా, మాస్ మహారాజా రవితేజ కీలక అతిథి పాత్రలో నటించాడు. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినిమా రిలీజ్ కి టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి పలు మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడుతూ చిరు నటి, ఏపీ మంత్రి రోజాపై ఇండైరెక్ట్ గా పంచ్ లు వేసిన తీరు ఆకట్టుకుంటోంది.
చిరు సమయ స్ఫూర్తికి, హాస్య చతురతకు అద్దంపడుతోంది. ఇటీవల నటి, మంత్రి రోజా మాట్లాడుతూ సాధారణంగా నటీనటులు చాలా సెన్సిటివ్, వెరీ ఎమోషనల్. ఎమ్జీఆర్, జయలలిత, ఎన్టీఆర్ వంటి దిగ్గజ నటులు ప్రజల నుంచి అపారమైన గౌరవాన్ని దక్కించుకున్నారు.
కానీ చిరు, పవన్ కల్యాణ్, నాగబాబులకు మాత్రం ఎలాంటి ఎమోషన్స్ లేవు. అందుకే ఈ ముగ్గురు అన్నదమ్ములను సొంత నియోజకవర్గ ప్రజలే తిరస్కరించారు' అంటూ హేళనగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నాగబాబు గట్టి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై మెగస్టార్ చిరంజీవి కూడా తన స్టైల్లో పంచ్ వేయగం విశేషం. ఇన్ని రోజులు నాతో స్నేహంగా వుండి నా సహాయం తీసుకుని సహయం కోసం నా ఇంటికి వచ్చిన వారు కూడా నేను ఎటువంటి సహాయం చేయలేదంటున్నారు.
నేను ఎవరికి సహాయం చేశానో నాకు తెలుసు.. నా సహాయం తీసుకున్న వారికి తెలుసు. నా గురించి తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో కానీ అలాంటి వారిని కేర్ చేయను. నా పేరు వాడకపోతే వారికి మనుగడ ఉండదనే నా గురించి మాట్లాడుతున్నారు' అంటూ రోజాపై మెగా పంచ్ వేయడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.