Begin typing your search above and press return to search.

వీడియో : సూపర్ స్టార్‌ ను ఇమిటేట్‌ చేసిన మెగాస్టార్‌

By:  Tupaki Desk   |   20 Jun 2022 9:42 AM GMT
వీడియో : సూపర్ స్టార్‌ ను ఇమిటేట్‌ చేసిన మెగాస్టార్‌
X
మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిన తెలుగు ఇండియన్ ఐడల్‌ గ్రాండ్ ఫినాలే మెగా ఎపిసోడ్‌ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి హాజరు అయ్యారు. ఆ ఎపిసోడ్‌ ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్‌ అవుతోంది.. అంతే కాకుండా ఆ ఎపిసోడ్‌ కు సంబంధించిన విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ముఖ్యంగా మెగాస్టార్‌ చిరంజీవి ఒకానొక సందర్బంగా సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ వాకింగ్‌ స్టైల్ ను మరియు మ్యానరిజంను ఇమిటేట్‌ చేశాడు. ఆ వీడియో బాగా వైరల్‌ అయ్యింది.

చిరంజీవి మరియు రజినీకాంత్‌ లు చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్. వారిద్దరు కూడా ప్రతి ముఖ్యమైన సందర్బంలో కలుస్తూ ఉంటారు. అలాంటి మెగాస్టార్‌ సరదాగా సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ను ఇమిటేట్‌ చేయడం అందరికి బాగా కనెక్ట్‌ అయ్యింది.

మెగాస్టార్‌ అభిమానులతో పాటు సూపర్‌ స్టార్‌ అభిమానులు కూడా ప్రస్తుతం ఈ వీడియోను తెగ షేర్‌ చేస్తూ నెట్టింట సందడి చేస్తున్నారు. చిరంజీవి చాలా జోవియల్‌ గా షో మొత్తం ఉత్సాహంగా కనిపించి అందరిని పలకరిస్తూ ఎంటర్‌ టైన్ చేశాడు. గతంలో బిగ్ బాస్ గ్రాండ్‌ ఫినాలే లో పాల్గొన్న సమయంలో ఎలా అయితే సరదాగా కంటెస్టెంట్స్ తో మాట్లాడారో తెలిసిందే.

చిరంజీవి తాజాగా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షో యొక్క కంటెస్టెంట్స్ తో కూడా చక్కగా మాట్లాడి ఎంటర్ టైన్ చేశాడు. చిరంజీవి ప్రజెన్స్ తో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్‌ షో కు విపరీతమైన వ్యూస్‌ మరియు ప్లే టైమ్ వచ్చిందని తెలుస్తోంది. ఇప్పటికే ఆహా లో చిరు ఎపిసోడ్‌ ట్రెండ్‌ అవుతోంది.

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆచార్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్వరలో గాడ్ ఫాదర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అదే కాకుండా భోళా శంకర్ మరియు వాల్తేరు వీరయ్య సినిమాలను కూడా మెగాస్టార్‌ చిరంజీవి చేస్తున్న విషయం తెల్సిందే.