Begin typing your search above and press return to search.
మీడియాపై మెగా బ్లాస్ట్ కారణం ఇదా?
By: Tupaki Desk | 9 Oct 2022 8:41 AM GMTమెగాస్టార్ చిరంజీవి ఎంత కూల్ పర్సన్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. తనపై ఎలాంటి విమర్శలొచ్చినా అంతే కూల్ గా సమాధానం ఇస్తారు. అదీ ఆయనకు స్పందించాలని ఆసక్తి ఉంటే మాత్రమే మాట్లాడుతారు. లేదంటే వాటిని సైతం పట్టించుకోని సందర్భాలెన్నో ఉన్నాయి. అందులోనూ మీడియాలో ఎలాంటి వార్తలొచ్చినా ఆయనెప్పుడు స్పందించరు.
వాళ్లకి సరైన సమాచారం లేక పొరబొట్టారు అనుకుంటారు తప్ప మీడియాని నిందించింది లేదు. 150 సినిమాల చరిత్రలో మెగాస్టార్ ఇంత వరకూ ఏనాడు బ్లాస్ట్ అయింది లేదు. అయితే గాడ్ ఫాదర్ విషయంలో మాత్రం మెగాస్టార్ తనలోని సెకెండ్ యాంగి ల్ ని చూపించారు. సినిమా ప్రచారంపై వచ్చిన మీడియా కథనాలపై మెగాస్టార్ తనదైన శైలిలో మండిపడిన సంగతి తెలిసిందే.
మా సినిమా ఎలా ప్రచారం చేయాలో మాకు తెలియదా? ఆ విషయాలు కూడా మీరు మాకు చెబుతారా? అంటూ అసహనాన్ని వ్యక్తం చేసారు. ఆరకంగా గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో కొత్త చిరంజీవిని పరిచయం చేసారు. గాడ్‌ఫాదర్ ప్రమోషన్స్ గురించి చెడుగా వ్రాసినందుకు .. విడుదలకు ముందు సినిమా చుట్టూ ఎటువంటి సందడి హడావుడి లేదని రచ్చ చేసినందుకు చిరు మీడియాపై విరుచుకుపడ్డారు.
ఒక సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో? ఎలా ఆకట్టుకునే అవుట్‌పుట్‌తో బయటకు రావాలో తమకు (నిర్మాతలకు) తెలియనట్లు మీడియా తమను ఇబ్బంది పెట్టిందని పేర్కొన్నారు. గాడ్ ఫాదర్ రీలీజ్ అయిన వెంటనే 5కి 3 నుండి 3.5 రేటింగ్స్ ఇచ్చారని చిరు తర్వాత మీడియాను మెచ్చుకున్నారనుకోండి. చిరు మీడియాపై రియాక్ట్ అయినందుకు అసలు కారణం అది కాదు..ఇది అంటా తాజాగా కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.
కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సినిమాని ప్రమోట్ చేయడం లేదని.. ఓపెనింగ్స్ రాబట్టడానికి సినిమా బజ్ లేదంటూ సినిమా విడుదలకు ముందే చిరంజీవి వద్దకు వెళ్లినట్లు ఒక కథనం వెలువడింది. అదే సమయంలో చిరంజీవికి సన్నిహితంగా ఉండే కొంతమంది సోషల్ మీడియాను ఎలా నిర్వహించాలో ? సినిమాకి సంబంధించిన బజ్‌ను ఎలా నిర్వహించాలో సలహా ఇచ్చినట్లు సమాచారం.
ఈ విషయాలన్నీ చిరంజీవిని కలవరపెట్టాయని ..సినిమా తీయడం .. దానిని విడుదల చేయడం గురించి అనుభవం లేని వ్యక్తులు సలహా ఇవ్వడం తనకు ఇష్టం లేనందున చిరు ఆరకంగా తన మౌనాన్ని వీడారని అంటున్నారు. అలాగే గరికపాటి ఇష్యూ- ఆచార్య చుట్టూ జరిగిన దుష్ప్రచారం.. దాని రిజల్ట్ వంటి ఇతర విషయాలపై చిరంజీవి పరోక్షంగా తన నిస్పృహను ఈ విధంగానే బయటపెట్టారని కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది.