Begin typing your search above and press return to search.

మూడేళ్ల తర్వాత సూపర్‌ స్టార్‌ రికార్డ్‌ బ్రేక్‌

By:  Tupaki Desk   |   8 March 2022 12:30 AM GMT
మూడేళ్ల తర్వాత సూపర్‌ స్టార్‌ రికార్డ్‌ బ్రేక్‌
X
మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్ లాల్‌ నటించిన 'లూసీఫర్‌' సినిమా 2019 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మలయాళ సినీ ఇండస్ట్రీలో అప్పటి వరకు ఏ సినిమా దక్కించుకోని అత్యధిక వసూళ్లను దక్కించుకుంది. ఆ సినిమా రికార్డును బ్రేక్ చేయడం ఇప్పటి వరకు ఏ హీరోకు కూడా సాధ్యం కాలేదు అనుకుంటున్న సమయంలో మలయాళ మెగాస్టార్‌ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.

మెగాస్టార్‌ మమ్ముట్టీ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీష్మ పర్వం అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. రివ్యూలు కూడా చాలా పాజిటివ్‌ గా రావడంతో సినిమా ను భారీ ఎత్తున చూసేందుకు జనాలు థియేటర్ల వద్ద క్యూ కట్టారు. గత రెండేళ్ల తర్వాత భారీ వసూళ్లు దక్కించుకున్న సినిమా గా కూడా భీష్మ పర్వం సినిమా నిలిచింది.

గ్యాంగ్‌ స్టర్ కథ తో రూపొందిన ఈ సినిమా లో మమ్ముట్టీని అద్బుతంగా ప్రజెంట్‌ చేయడం లో దర్శకుడు పూర్తిగా సఫలం అయ్యాడు. ఆయన నుండి వరుసగా సినిమాలు వస్తున్నా కూడా అవి ప్లాప్ అవుతున్న ఈ సమయంలో గ్యాంగ్‌ స్టర్ గా భీష్మ పర్వం లో చూపించి అభిమానులకు కన్నుల పండుగగా సినిమాను మార్చాడు అంటూ మలయాళ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

లూసీఫర్‌ సినిమా ఒక సంచలనంగా ఇన్నాళ్లు కొనసాగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆ సినిమా బాక్సాఫీస్ నెం.1 రికార్డు చేజారింది. లూసీఫర్ లాంగ్‌ రన్ వసూళ్లను ఇప్పటికే వసూళ్లు చేసిన భీష్మ పర్వం రాబట్టిందనే టాక్‌ వినిపిస్తుంది. మొదటి వారం రోజుల్లో ఇప్పటివరకు ఏ మలయాళ మూవీ సాధించని వసూళ్లు సాధించడంతో మమ్ముట్టీ అభిమానులు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.

తెలుగు లో మెగాస్టార్‌ మమ్ముట్టీ కీలక పాత్రలో త్వరలోనే ఒక సినిమా తో రాబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. చాలా కాలం గా తెలుగు లో సినిమాల ఆఫర్లు వస్తున్నా కూడా కాదంటూ వస్తున్న ఈయన యాత్ర సినిమా తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలకు మమ్ముక్క నో చెప్పడం జరిగింది. కాని ఇప్పుడు మాత్రం ఆయన టాలీవుడ్‌ ప్రేక్షకులను బ్యాక్ టు బ్యాక్ మోహన్ లాల్‌ మాదిరిగా ఎంటర్ టైన్ చేసేందుకు సిద్దం అయ్యాడు.