Begin typing your search above and press return to search.
ఊర మాస్ మీద మెగాస్టార్ మోజు... ?
By: Tupaki Desk | 11 Dec 2021 2:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ నాలుగున్నర దశాబ్దాలకు చేరుకుంది. 150కి పైగా సినిమాలు చేశారు. అందులో హిట్లూ సూపర్ హిట్లూ చాలానే ఉన్నాయి. బ్లాక్ బస్టర్లు కూడా బోలెడు ఉన్నాయి. ఇక చిరంజీవి ఏ జానర్ లో అయినా నటించి రక్తి కట్టించే నైపుణ్యం కలిగిన స్టార్ అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది మాస్ హీరోలు క్లాస్ మూవీస్ చేయలేరు, కానీ మెగాస్టార్ మాత్రం అటు మాస్ తో పాటు ఇటు క్లాస్ ని కూడా బ్యాలెన్స్ చేస్తూ టోటల్ గా అన్ని వర్గాలా జనాల అభిమానాన్ని చూరగొన్నారు.
లేకపోతే ఆయక సినీ కెరీర్ లో కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు వంటి కమర్షియల్ హీరోలతో హిట్లు ఇస్తూనే కళాతపస్వి కె విశ్వనాధ్ తోనూ విజయవంతమైన చిత్రాలు చేసిన రికార్డు ఉండదు కదా. ఇక బాపు లాంటి కళాత్మక దర్శకుడితో సినిమాలు చేసి సూపర్ అనిపించుకున ఘనత కూడా చిరంజీవిదే. అంతే కాదు ఆలోచనాత్మకమైన సినిమాలు ఆఫ్ బిట్ మూవీస్ తీసే కె బాలచందర్ తో కూడా మూవీస్ చేసి ఆర్టిస్ట్ గా ముద్ర వేసుకున్న గొప్పతనం చిరంజీవిది.
మరి ఒక్క చిరంజీవిలో ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. ఒక రజనీకాంత్, ఒక కమల్ హాసన్ కలిస్తే మెగాస్టార్ అన్న మాట ఊరకే రాదు కదా. ఇపుడు ఆరున్నర పదుల వయసులో కూడా చిరంజీవి అలుపెరగని వీరుడిగా నటనలో తరిస్తున్నారు, తపిస్తున్నారు. ఈ రోజుకీ కొత్తగా ఆయన ఆలోచనలు ఉంటాయి. తాను ఇంకా వేయాల్సిన పాత్రలు చాలా ఉన్నాయని ఆయన నమ్ముతారు.
అందుకే ఆయన ఎన్ని రోల్స్ ప్లే చేసినా పక్కా ఊర మాస్ రోల్ చేయాలన్న కొత్త కోరిక పుడుతోందిట. నిజంగా చిరంజీవి ఊరమాస్ క్యారక్టర్లు చేయలేదా అంటే కెరీర్ లో కొన్ని అలా కనిపిస్తాయి. రిక్షావోడు, అందరివాడు, ఆరాధన మూవీస్ లో ఆయన వేసిన మాస్ రోల్స్ చూస్తే ఆయన చేయకపోవడమేంటి అనిపించకమానదు. అయితే వాటిని మించి ఇంకా చేయాలని చిరంజీవి ఆశిస్తున్నారుట. అలాంటి సబ్జెక్ట్ కనుక వస్తే చేయడానికి రెడీ అంటున్నారుట. మరి బోయపాటి లాంటి ఊర మాస్ డైరెక్టర్ కాంబోలో మెగా కోరిక తీరే అవకాశం అయితే ఉంది.
బోయపాటి యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్ ని తీస్తారు. అంతే కాదు హీరోని వేరే లెవెల్ లో ఎలివేట్ చేయాలీ అంటే బోయపాటి వల్ల మాత్రమే అవుతుంది అని చెప్పాల్సిందే. బాలయ్యను, అల్లు అర్జున్ ని అలా బోయపాటి ఎక్కడో ఊర మాస్ లెక్కల్లో నిలబెట్టారు. తొందరలో మెగాస్టార్ తో కూడా మూవీ చేసి ఆయనకూ అభిమానులకూ అలరించే వీర లెవెల్ ఊర మాస్ మూవీ తీయాలని అంతా కోరుకుంటున్నారు.