Begin typing your search above and press return to search.

థ‌ర్డ్ వేవ్ లోనూ మెగాస్టార్ ఆక్సిజ‌న్ బ్యాంకుల సేవ‌ల‌కు రంగం సిద్ధం!

By:  Tupaki Desk   |   31 Aug 2021 3:04 AM GMT
థ‌ర్డ్ వేవ్ లోనూ మెగాస్టార్ ఆక్సిజ‌న్ బ్యాంకుల సేవ‌ల‌కు రంగం సిద్ధం!
X
మెగాస్టార్ చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ బ్ల‌డ్ బ్యాంక్ - ఐబ్యాంక్ సేవ‌ల‌తో పాటు ఆక్సిజన్ బ్యాంక్ సేవ‌ల‌కు ప్ర‌జ‌ల్లో ప్ర‌శంస‌లు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా సెకండ్ వేవ్ క‌ష్ట కాలంలో ఆక్సిజ‌న్ బ్యాంకులు ఎంద‌రో రోగుల ప్రాణాల్ని కాపాడాయి. మునుముందు ఆక్సిజ‌న్ బ్యాంకుల సేవాల్ని కొన‌సాగిస్తామ‌ని మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. సేవ‌ల కొన‌సాగింపులో అభిమానుల స‌హాయ‌స‌హ‌కారాల‌ను చిరు ఈ సంద‌ర్భంగా కొనియాడారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ-``నా అభిమానులంద‌రికీ న‌మ‌స్కారం. నా జ‌న్మ‌దినం కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌రిగిన బ‌ర్త్ డే వేడుక‌ల‌కు సంతోషం. ముఖ్యంగా ఆక్సిజ‌న్ బ్యాంకులు వ్య‌వ‌స్థాప‌న నిర్వ‌హ‌ణ‌ను అభిమానులు న‌డిపించ‌డాన్ని హ్యాపీగా గ‌ర్వంగా ఫీల‌వుతున్నారు. గ‌ర్వించ‌డ‌మే కాదు మేము సైతం అంటూ అభిమానులు భారీగా విరాళాలు అందించ‌డం ఆనందం క‌లిగించింది. ఒక గొప్ప ల‌క్ష్యంతో ఇవ‌న్నీ స్థాపించాం. అన్ని వ‌ర్గాల నుంచి విరాళాల రూపంలో స్పంద‌న బావుంది`` అని తెలిపారు.

ఇంకా మాట్లాడుతూ.. ``జ‌న‌సేన పార్టీ ఎన్నారై విభాగం నుంచి అందించిన విరాళాలు స‌హాయ స‌హ‌కారాలకు సంతోషం. చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ కి ఎన్నారై-న్యూజిలాండ్ విభాగం వారు రూ. 556789 విరాళం అందించారు. ర‌వి మిరియాల- వ‌ర‌హ‌రి గాజుల- చందు- రాము- త్రిపాఠి అండ్ జ‌న‌సేన టీమ్ నిధిని అందించారు. చాలా సంతోషంగా ఉంది. మునుముందు మీ అంద‌రి స‌హాయ‌స‌హ‌కారాల‌తో ఆక్సిజ‌న్ బ్యాంకుల సేవ‌ల్ని ముందుకు తీసుకెళ‌తాను..`` అని అన్నారు. థ‌ర్డ్ వేవ్ ముంచుకొస్తే అవ‌స‌ర‌మైన సేవ‌ల్ని చేసేందుకు చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ స‌ర్వ‌స‌న్నాహ‌కాల్లో ఉంది. ముఖ్యంగా క‌రోనా రోగుల సేవ‌ల కోసం ఆక్సిజ‌న్ బ్యాంల నిర్వ‌హ‌ణ కోసం ట్ర‌స్ట్ సిద్ధంగా ఉంద‌ని చిరు తెలిపారు. దీనికోసం చిరంజీవి అభిమానులు స‌హా జ‌న‌సేన అభిమానులు స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తుండ‌డం విశేషం.