Begin typing your search above and press return to search.
బాహుబలి లెవెల్ సూపర్, మెగా బెగ్గింగ్!
By: Tupaki Desk | 11 Feb 2022 6:38 AM GMTఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ తో సినిమా పరిశ్రమ- ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదానికి పుల్ స్టాప్ పడిన సంగతి తెలిసిందే. చిరంజీవి...మహేష్ ..ప్రభాస్..రాజమౌళి..కొరటాల శివ లాంటి ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి తో భేటీ అవ్వడం తో పరిశ్రమకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. అందరూ సీఎంని తమదైన శైలిలో ప్రశంసించారు.
ప్రభుత్వంతో చర్చలు జరపడంలో ఇక్కడ ప్రధాన పాత్ర పోషించింది చిరంజీవినే. కానీ నిన్నటి భేటీలో జరిగిన కొన్ని సన్నివేశాలు ఇప్పుడు ఓ సెక్షన్ మెగా అభిమానులకు మింగుడు పడకుంటా చేస్తున్నాయ. ప్రభుత్వం ద్వారా హక్కులతో సాధించుకోవాల్సింది బ్రతిమలాడుకుని సాధించుకున్నట్లు ఉందని అసహనం వ్యక్తం అవుతోంది.
తమ సమస్యల్ని పరిష్కరించాలని సీఎంని చిరంజీవి చేతులు జోడించి అడగడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి నిరాడంబరతకు..సౌమ్యత్వానికి ఇది సూచికే అయినా మరీ ఇంతలా కిందకి దిగాలా? అనే అసహనం సోషల్ మీడియాలో అభిమానులు వ్యక్తం చేయడంతో...సింగంలా రాంగోపాల్ వర్మ రంగంలోకి దిగిపోయారు. ట్విటర్ వేదికగా అర్ధరాత్రి తనదైన శైలిలో ఈ వ్యవహారంపై కామెంట్ చేసారు.
సా`ర్ చిరంజీవిగారు..మీ మెగా అభిమానిగా..మీ మెగా బిచ్చగాళ్లతో నేను మెగా హర్ట్ అయ్యాను. భయంతో కూడిన బానిస వైఖరి కనిపిస్తోంది మీ మెగా బెగ్గింగ్ తో. మెగా హర్ట్ అయ్యాను. మెగా అభిమానుల్ని నిరాశపరిచారని`` అన్నారు. మరికాస్త ముందుకెళ్లిన వర్మ ``సూపర్ మెగా బాహుబలి లెవల్ బెగ్గింగ్.. ఒమెగాస్టార్ వైఎస్ జగన్ వాళ్లని అభినందించడం సర్వత్రా చర్చకొస్తుంది. బాహుబలిని మించిన మహాబల్ వైఎస్ జగన్ అంటూ వర్మ తనదైన శైలిలో ట్విటర్ వేదికగా పంచ్ వేసారు.
వర్మ వ్యాఖ్యల్లో నిజాయితీ ఎంత అన్నది పక్కనబెడితే.. గతంలో మంత్రి పేర్ని నానితో వర్మ కూడా పరిశ్రమ సమస్యలపై భేటి అయిన సంగతి తెలిసిందే. పరిశ్రమ వ్యక్తిగా కాదు..వ్యక్తిగతంతో మంత్రితో భేటీ అవుతున్నాను.. తాను చెప్పాలనుకున్నది మాత్రమే చెబుతాని మంత్రిని కలిసి చెప్పొచ్చారు వర్మ.
అయితే ఈ భేటిలో వర్మ కేవలం తనదైన శైలిలో హక్కులు గురించి డిమాండ్ చేసినట్లే కనిపించింది. అంతకు ముందు నెట్టింట వైరల్ అయిన కొన్ని సోషల్ రైట్స్ నేపథ్యంలో వాటిని ఆధారంగా చేసుకునే వర్మ మాట్లాడారు. మరి వర్మ తాజా కామెంట్లు...డిమాండ్ వైఖరిని సరిపొల్చేతే..ఎవరు రైట్? ఎవరు రాంగ్ అన్నది తేలిపోతుంది.