Begin typing your search above and press return to search.

వీర‌య్య‌ని 'గ్యాంగ్ లీడ‌ర్' ని చేస్తున్నారే!

By:  Tupaki Desk   |   25 Dec 2022 5:56 AM GMT
వీర‌య్య‌ని గ్యాంగ్ లీడ‌ర్ ని  చేస్తున్నారే!
X
`వాల్తేరు వీర‌య్య` ఊర మాస్ హంగామా షురూ చేసిన‌ సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాల‌తో మెగాస్టార్ మార్కెట్ లో ర‌చ్చ రచ్చ చేస్తున్నారు. ఊపు చూస్తుంటే మెగాస్టార్ ఖాతాలో భారీ హిట్ ఖాయ‌మే అని సంకేతాలు చెప్ప‌క‌నే చెబుతున్నాయి. ద‌ర్శ‌కుడు బాబి చెప్పిన‌ట్లు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకునే ట‌ట్లే క‌నిపిస్తున్నాడు. తాజాగా బాబి ప్రామిస్ కి త‌గ్గ‌ట్టు ఓ కొత్త పోస్ట‌ర్ రిలీజ్ అయింది.

ఇందులో చిరంజీవి చేతిలో ఫైర్ ప‌ట్టుకుని...క‌ళ్ల‌కి న‌ల్ల అద్దాలు ధ‌రించి..బ్లాక్ ష‌ర్ట్ లో సీరియ‌స్ మోడ్ లో క‌నిపిస్తున్నారు. స‌రిగ్గా ఇదే స్టిల్ కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయిన `గ్యాంగ్ లీడ‌ర్` పోస్ట‌ర్ ని త‌ల‌పించింది. ఆ సినిమాలో చిరంజీవి స్టిల్ ఒక‌టి ఇలాగే ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంది. కాక‌పోతే అప్ప‌టి పోస్ట‌ర్లో హెయిర్ స్టైల్ ఛేంజ్ అయింది. అలాగే చిరు వ‌య‌సులో వ్య‌త్యాసం క‌నిపిస్తుంది.

మిగ‌తా వ‌న్నీ ఒకేలా ఉన్నాయి. ఈ పోస్ట‌ర్ ని బ‌ట్టి బాబి ఇచ్చిన‌ మాట‌కు ఎంత‌గా క‌ట్టుబ‌డ్డాడు అన్న‌ది అద్దం ప‌డుతుంది. సినిమా ప్రారంభానికి ముందే మీకు పాత చిరంజీవి చూపిస్తాన‌ని....ఓ అభిమాని త‌న అభిమాన హీరోని ఇష్ట‌ప‌డి డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో? త‌న అభిమానంతా సినిమాలో చూపిస్తాన‌న్నారు. తాజా సంకేతాల‌న్ని ఆ మాట‌ల్ని మ‌రోసారి గుర్తు చేస్తున్నాయి.


ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ అభిమానుల్ని ఆక‌ట్టుకుంటుంది. మ‌ళ్లీ `గ్యాంగ్ లీడ‌ర్` లాంటి సినిమా దించుతున్నారా? అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన రెండు పాట‌లు శ్రోత‌ల్ని అల‌రిస్తున్నాయి. బాస్ పార్టీ సాంగ్ పై కొంత నెగిటివిటీ వ‌చ్చిన‌ప్ప‌టికీ భారీ వ్యూస్ ని సొంతం చేసుకున్న పాట‌గా నిలిచింది.

ఈనెల 26న మ‌రో లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. ఆ సంద‌ర్భంగానే కొత్త పోస్ట‌ర్ తో ఇలా ర‌చ్చ చేస్తున్నారు. మ‌రి ఆ లిరిక‌ల్ సాంగ్ లో చిరు లుక్ ఎలా ఉంటుందో చూడాలి. అన్ని ప‌నులు పూర్తిచేసి చిత్రాన్ని జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే.