Begin typing your search above and press return to search.
మెగాస్టార్ సమర్పించు అమీర్‌ఖాన్ చిత్రం!
By: Tupaki Desk | 16 July 2022 7:30 AM GMTగత కొంత కాలంగా బాలీవుడ్ స్టార్స్ తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. దక్షిణాది చిత్రాల తరహాలో ఉత్తరాది ప్రేక్షకుల్ని తమ సినిమాలు ఆకట్టుకోలేకపోతున్నాయని ఫలీవుతున్నారు. ఎలాగైనా సౌత్ సినిమాలని మరిపించే మూవీస్ ని అందించిన తిరిగి తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో సౌత్ సినిమాలు బాలీవుడ్ ని ఏలేస్తున్నట్టుగా మన సినిమాలని కూడా అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ చేసి సౌత్ లో కూడా పాగా వేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇందు కోసం ఇక్కడి స్టార్ లని తమ ప్రాజెక్ట్ లకు అసోసియేట్ లు చేసుకుని సౌత్ లో పాగా వేయాలనుకుంటున్నారు.ఇందు కోసం స్టార్ డైరెక్టర్ రాజమౌళి, మెగాస్టార్ చిరంజీవిలని ఎంచుకుంటున్నారు. బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న భారీ ఫాంటసీ మూవీ `బ్రహ్మాస్త్ర`. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందిస్తున్నారు. తొలి భాగాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేయబోతున్నారు. తెలుగు, తమిళ భాషలకు గానూ ఈ మూవీకి సమర్పకుడిగా స్టార్ డైరక్టర్ రాజమౌళి వ్యవహరిస్తున్నారు.
ఇప్పడు ఇదే తరహాలో మెగాస్టార్ చిరంజీవిని సమర్పకుడిగా మరో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఎంచుకున్నారు. తను నటిస్తున్న లేటెస్ట్ మూవీ `లాల్ సింగ్ చద్దా`. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించాడు. కరీనా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ద్వారా హీరో నాగచైతన్య బాలీవుడ్ కు పరిచయమవుతున్న విషయం తెలిసిందే. హిందీతో పాటు ఐదు భాషల్లో ఆగస్టు 11న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. తెలుగు వెర్షన్ కు మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. శనివారం ఈ విషయాన్ని వెలల్డిస్తూ మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ని అభిమానులతో పంచుకున్నారు.
`నా మిత్రుడు అమీర్ ఖాన్ నటించిన వండర్ ఫుల్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ `లాల్ సింగ్ చద్దా` తెలుగు వెర్షన్ కు సమర్పకుడిగా వ్యవహరించడం చాలా విశేషంగా భావిస్తున్నాను` అని ట్వీట్ చేశారు. అంతే కాకుండా `కొన్నేళ్ల క్రితం నా మిత్రుడు అమీర్ ని కలిశానని, అక్కడ ఇద్దరం కొంత సేపు మాట్లాడుకున్నామని, ఆ తరువాత అతని డ్రీమ్ ప్రాజెక్ట్ `లాల్ సింగ్ చద్దా`లో నేనూ భాగం అయ్యానని తెలిపారు. మా ఇంట్లో ప్రత్యేకంగా ఈ మూవీ ప్రివ్యూని ప్రదర్శించడం ఆనందంగా వుందన్నారు. ఈ సినిమా ఓ వండర్ ఫుల్ ఎమోషనల్ జర్నీ అని ప్రశంసించారు.
ఈ మూవీ ఎక్స క్లూసివ్ ప్రీమియర్ షోని మెగాస్టార్ నివాసం లో ఇటీవల ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అమీర్‌ఖాన్, నాగచైతన్యతో పాటు చిరంజీవి, నాగార్జున రాజమౌళి, సుకుమార్ తదితరులు ప్తర్యేకంగా వీక్షించారు. అనంతరం అమీర్ ఖాన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మెగా స్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అమీర్‌ఖాన్ ని శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించడం విశేషం. వయాకామ్ 18 స్టూడియోస్, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి.